మీలో సహనం పాళ్లు ఎంత? | How much patience are you in? | Sakshi
Sakshi News home page

మీలో సహనం పాళ్లు ఎంత?

Jun 9 2018 1:42 AM | Updated on Jun 9 2018 1:42 AM

How much patience are you in? - Sakshi

సహనం వహిస్తే కష్టమైన పనినైనా తేలికగా పరిష్కరించవచ్చు. కొంతమంది చిన్న చిన్న ఇబ్బందులని కూడా ప్రశాంతంగా ఎదుర్కోలేక తరచుగా సహనం కోల్పోతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు మానవ సంబంధాలు దెబ్బతినవచ్చు. ఫలితంగా నష్టమే తప్ప లాభం ఉండదు. మీరు చిన్నచిన్న విషయాలకు కూడా అసహనానికి లోనవుతుంటారా? 

1.    మీరు హోటల్‌కి వెళ్ళినప్పుడు ఆర్డర్‌ తీసుకోవడం కొద్దిగా ఆలస్యమైతే కోపగించుకుని తిరిగి వచ్చేస్తారు. 
    ఎ. అవును     బి. కాదు 

2.    మీ వాహనంలో పెట్రోల్‌ ఎప్పుడయిపోతుందో తెలియదు. బంక్‌లో క్యూ ఎక్కువగా ఉంది. మర్నాడు పెట్రోలు పట్టించుకునేంత టైమ్‌ ఉండదని తెలిసినా క్యూలో వెయిట్‌ చేయకుండా వెళ్ళిపోయే రిస్క్‌ తీసుకుంటారు. 
    ఎ. అవును     బి. కాదు 

3.    పబ్లిక్‌ టెలిఫోన్‌ దగ్గర మీకంటే ముందున్న వ్యక్తి నిర్దిష్ట సమయం కంటే ఎక్కువగా మాట్లాడుతుంటే ‘పబ్లిక్‌ టెలిఫోన్‌ని ఎలా వాడాలో తెలీదా?’ అని క్లాస్‌ తీసుకుంటారు. 
    ఎ. అవును     బి. కాదు 

4.    ఆటో అతను పది రూపాయలు ఎక్స్‌ట్రా అడిగితే, ఎక్సట్రా ఎందుకివ్వాలంటూ వాగ్వివాదానికి దిగుతారు. 
    ఎ. అవును     బి. కాదు 

5.    మీ పక్కింటివాళ్లు రేడియో, టీవీలు కాస్త ఎక్కువ సౌండుతో పెడితే, ‘న్యూసెన్స్‌ కంప్లయింట్‌ ఇస్తానం’టూ వారికి వార్నింగ్‌ ఇస్తారు.
    ఎ. అవును     బి. కాదు 

6.    ట్రాఫిక్‌లో మీ ముందున్న వాహనం కదలకపోతే, ఏం జరిగిందో తెలుసుకోకుండా హారన్‌ కొడుతూనే ఉంటారు.
    ఎ. అవును     బి. కాదు 

7.    కొన్ని ఫోన్‌కాల్స్‌ వచ్చి మీరు డిస్టర్బ్‌ అయితే తిట్టిన సందర్భాలున్నాయి.
    ఎ. అవును     బి. కాదు 

8.    ఒకసారి వివరించిన విషయాన్నే మళ్ళీ చెప్పాల్సి వస్తే చిరాకు పడతారు.
    ఎ. అవును     బి. కాదు 

9.    మీరు స్నేహితుల కోసం వెయిట్‌ చేస్తున్నారు. అప్పటికే పది నిమిషాలు దాటిపోతే... ఇంతకంటే వెయిట్‌ చెయ్యడం దండగ అనుకుని వారికి ఇన్‌ఫార్మ్‌ చెయ్యకుండానే వెనక్కి వెళ్ళిపోతారు.
    ఎ. అవును     బి. కాదు 

10.    మిమ్మల్ని రెండోసారి ప్రశ్న అడగడానికి పక్కవారు భయపడతారు.
    ఎ. అవును     బి. కాదు 

‘ఎ’లు ఏడు దాటితే మీలో ఓర్పు చాలా తక్కువ. చిన్న చిన్న విషయాలలో కూడా సహనంతో ఉండక కోపగించుకుంటారు. ‘తన కోపమె తన శత్రువు’ అని గ్రహించండి.  ‘బి’ లు ఏడు దాటితే సహనంగా ఉండడంలో మీకు సాధ్యమే. ఎంత పెద్ద సమస్య వచ్చి పడినా ప్రశాంతంగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ‘బి’ లను సూచనలుగా తీసుకుని ఓర్పుగా ఉంటే అది మీకు, మీ ఆరోగ్యానికి కూడా మంచిది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement