ఐక్యూ పెరగాలంటే?

how to  increase in Intelligence Counsel - Sakshi

సెల్ఫ్‌ చెక్‌

జీవితంలో విజయవంతంగా ముందుకు పోవడానికి వివేకం, విచక్షణ చాలా అవసరం. ఇందుకు ఐక్యూ (ఇంటెలిజెన్స్‌ కోషెంట్‌) స్థాయిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. పిల్లల్లో వివేక సూచిక (ఐక్యూ)ను పెంచడానికి మన వంతు ప్రయత్నం చేస్తున్నామా?

1.    పిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ ఐక్యూ మెరుగుపడటంలో ఆహారం కీలకం. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్, ఫ్యాట్‌ తగినంత ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలి.
    ఎ. అవును     బి. కాదు

2.    మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఆహారం అందనప్పుడు ఆ లోటును ఓమేగా 3 ఆయిల్‌ క్యాప్సూల్స్‌ భర్తీ చేస్తాయి, కానీ   వాటిని డాక్టరు సలహా లేకుండా వాడకూడదని మీకు తెలుసు.
    ఎ. అవును     బి. కాదు

3.    ఐక్యూ స్థాయి పెరగడానికి తగినంత నిద్ర తప్పని సరి. ముందు తరం పాటించినట్లు చదువుకునే పిల్లలు త్వరగా పడుకుని వేకువఝామున నిద్రలేవాలన్న నియమం అలాంటిదే.
    ఎ. అవును     బి. కాదు

4.    చదివినది ఎక్కువ కాలం జ్ఞాపకం ఉండాలంటే సుఖనిద్ర అవసరం. కలత నిద్ర వల్ల మెదడు గ్రహించిన విషయాలను తాత్కాలికంగా నిల్వ చేసుకుని త్వరగా వదిలేస్తుంది.
    ఎ. అవును     బి. కాదు

5.    చెస్, సుడోకు వంటి ఇండోర్‌ గేమ్స్, పజిల్స్‌ పరిష్కరించడం వంటి హాబీలు ఐక్యూ స్థాయిని పెంచుతాయి.
    ఎ. అవును     బి. కాదు

6.    పిల్లలు కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడేటప్పుడు వ్యూహాత్మకంగా ఆడాల్సిన ఆటలను ప్రోత్సహిస్తారు.
    ఎ. అవును     బి. కాదు

7.    దేహానికి వ్యాయామాన్నిస్తూ ఐక్యూ పెంచడానికి చేతుల కదలికలు, మెదడు, కంటి చూపు... మూడింటి సమన్వయంతో ఆడగలిగిన టెన్నిస్, పింగ్‌పాంగ్, బ్యాడ్మింటన్‌ వంటి ఆటలు దోహదం చేస్తాయి.
    ఎ. అవును     బి. కాదు

8.    దేహదారుఢ్యానికి మంచి ఆహారం, చక్కని వ్యాయామం, తగినంత విశ్రాంతి ఎలా అవసరమో మెదడు చురుకుదనానికి కూడా ఇవన్నీ అవసరమేనని మీకు తెలుసు.
    ఎ. అవును     బి. కాదు

9.    మెడిటేషన్, యోగసాధన ద్వారా మెదడు కణాలు ఉత్తేజితమవుతాయి.
ఎ. అవును     బి. కాదు

‘ఎ’లు ఐదు కంటే ఎక్కువ వస్తే ఐక్యూ పెంచుకోవడం మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువగా వస్తే మీరు పిల్లల విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకో వాలి. అప్పుడు వాళ్లు భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించగలుగుతారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top