క్యారట్‌ – చిక్‌పీ సలాడ్‌

క్యారట్‌ – చిక్‌పీ సలాడ్‌


హెల్దీ కుకింగ్‌



కావలసినవి: క్యారట్‌ తురుము – ఒక కప్పు, పచ్చి శనగలు – 100 గ్రా. (నానబెట్టి, పై పొట్టు తీసినవి), ఉప్పు – పావు టీ స్పూ , నిమ్మరసం – 2 టీ స్పూన్లు, ఆల  ఆయిల్‌ – 2 టీ స్పూన్లు (నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు), కొత్తిమీర తరుగు –  2 టేబుల్‌ స్పూన్లు, జున్ను – 100 గ్రా., మిరియాల పొడి – చిటికెడు



తయారి: క్యారట్‌ తురుములో ఉప్పు వేసి కలపాలి. ∙శనగగింజలను నీరు లేకుండా వడకట్టి క్యారట్‌ తురుములో కలపాలి ∙నిమ్మరసం వేసి, ఆ తర్వాత ఆలివ్‌ ఆయిల్‌ క్యారట్‌ తురుము అంతటికీ పట్టేలా కలపాలి ∙కొత్తిమీర తరుగు, ఆపైన జున్ను వేశాక మిరియాల పొడి చల్లి సర్వ్‌ చేయాలి.



నోట్‌: ఈ సలాడ్‌లో బాదంపప్పు, జీడిపప్పు వేసుకోవచ్చు. అలాగే కీర, పండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు. జున్ను బదులుగా చీజ్‌ను కరిగించి వాడుకోవచ్చు. తేనె కూడా వేసుకోవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top