అనారోగ్య సమస్యలు పీడిస్తుంటే... | Sakshi
Sakshi News home page

అనారోగ్య సమస్యలు పీడిస్తుంటే...

Published Sun, Sep 10 2017 12:56 AM

Health problems  and remedies

ఆహార విహారాల్లో నియమబద్ధంగా ఉంటున్నప్పటికీ, అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటున్నప్పటికీ కొందరు తరచుగా ఆరోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. తరచు ఆరోగ్య సమస్యలు పీడిస్తుండటంతో మనశ్శాంతి కోల్పోతారు. అలాంటి ఇబ్బందులను అధిగమించడానికి కొన్ని పరిహారాలు...

ప్రతి శనివారం కుక్కలకు, కాకులకు తీపి రొట్టెలు పెట్టాలి. వాటికి పెట్టే రొట్టెల సంఖ్య మీ కుటుంబ సభ్యుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి
ఇంట్లో ఎవరైనా అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లయితే, ఏదైనా ఒక గురువారం ఉదయం పూట ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ఒక తీపి గుమ్మడి కాయను సమర్పించండి
ఆంజనేయుడి ఆలయంలో ఆవనూనెతో అఖండ జ్యోతిని వెలిగించండి. ఈ పరిహారాన్ని వరుసగా ఐదు మంగళవారాలు పాటించాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లడానికి అవకాశం లేకుంటే, ఇంట్లోనే పూజ మందిరంలో ఆంజనేయుడి పటాన్ని ఉంచి కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు
స్నానం తర్వాత పూజకు ఉపక్రమించే ముందు తుంగముస్తికలను అరగదీసి, అందులో కాస్త గోరోచనాన్ని కలిపి తిలకంలా ధరించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. దీర్ఘవ్యాధులతో బాధపడే పేద వృద్ధులకు ఔషధ దానం చేయండి 
రాత్రి నిద్రించేటప్పుడు ఒక రాగిచెంబులో నీళ్లు నింపి తల వద్ద ఉంచుకోండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి.
– పన్యాల జగన్నాథ దాసు

Advertisement
Advertisement