అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే చెరుకు

Health benefits of sugarcane - Sakshi

ఇదివరలో చెరుకుగడలను పిల్లలు సంబరాలు, తిరునాళ్లప్పుడు నములుతూ, తింటూ ఆస్వాదిస్తూ ఉండేవారు. ఒక వయసు దాటాక పెద్దలు కూడా చెరుకుగడలను కాకుండా చెరుకురసాన్ని తాగడం వంటివి చేసేవారు. అయితే ఇటీవల చెరుకును ఆస్వాదించడం తగ్గిపోయింది. పైగా చెరుకురసం స్టాల్స్‌ దగ్గర ఉండే అపరిశుభ్రమైన వాతావరణం చెరుకురసం తాగేవారి సంఖ్యను తగ్గిస్తోంది. అయితే మురికినీళ్లతో తయారైన ఐస్‌లాంటివి వాడకుండా, పరిశుభ్రమైన వాతావరణంలో చెరుకురసం తీసి తాగడం లేదా పిల్లలు చెరుకుగడలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. చెరుకుతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే...

చెరుకు వేసవిలో తీసుకుంటే డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది
చెరుకులోని పోషకాలు చర్మానికి మంచి నిగారింపును ఇస్తాయి. చెరుకు ఏజింగ్‌ను నివారించి చాలాకాలం యౌవనంగా ఉండేలా తోడ్పడుతుంది ∙
చెరుకు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తుంది. వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
చెరుకురసంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. చెరుకురసం ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. గాయాలను త్వరగా మాన్పుతుంది        
చెరుకు కాలేయాన్ని సంరక్షిస్తుంది. బిలిరుబిన్‌ పాళ్లను అదుపులో ఉంచుతుంది. ఈ కారణం వల్లనే సాధారణంగా కామెర్లు వచ్చిన వారికి డాక్టర్లు చెరుకురసాన్ని సిఫార్సు చేస్తుంటారు. పైగా ఇది తేలిగ్గా జీర్ణమవుతూ జీర్ణవ్యవస్థపై ఎలాంటి భారం పడకుండా చూస్తుంది
అసిడిటీ సమస్యను స్వాభావికంగా తగ్గించే శక్తి చెరుకురసానికి ఉంది ∙చెరుకురసం పళ్లు, చిగుర్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా చూస్తుంది       
గర్భవతులు పరిశుభ్రమైన, తాజా చెరుకురసాన్ని తాగడం చాలా మంచిది. ఇది గర్భానికి రక్షణ కలిగిస్తుంది
చెరుకు పిల్లల్లో జ్వరాలను నివారిస్తుంది. తగ్గిస్తుంది
ఒంట్లోని విషాలను బయటకు పంపించే సహజ డీ–టాక్సిఫైయింగ్‌ ఏజెంట్‌ చెరుకు
చెరుకురసం ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. తగ్గిస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top