
మూడోసారి ముచ్చటగా...!
గ్లామరస్ రోల్స్ ఎంత బాగా చేయగలరో, సంప్రదాయబద్ధంగా ఉండే పాత్రలనూ అంతే బ్రహ్మాండంగా చేయగలరు నయనతార.
గాసిప్
గ్లామరస్ రోల్స్ ఎంత బాగా చేయగలరో, సంప్రదాయబద్ధంగా ఉండే పాత్రలనూ అంతే బ్రహ్మాండంగా చేయగలరు నయనతార. అందుకే, ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తూనే మరోవైపు ట్రెడిషనల్ క్యారెక్టర్స్, అప్పుడప్పుడూ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు. ‘అనామిక’ తర్వాత కథానాయిక ప్రాధాన్యంగా సాగే ‘మాయ’ అనే చిత్రంలో నటించారు నయనతార. ఈ రెండు చిత్రాల ద్వారా సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసే సత్తా తనకుందని నిరూపించుకున్నారు.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి లేడీ ఓరియంటెడ్ మూవీ ఒప్పుకున్నారని చెన్నై టాక్. తమిళ దర్శకుడు సర్గుణం దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన దాస్ రామస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట. విశేషం ఏంటంటే.. శిష్యుడు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సర్గుణమే నిర్మించనున్నారని సమాచారం.