ఆ అదృష్టం ఎవరికి? | Gossip | Sakshi
Sakshi News home page

ఆ అదృష్టం ఎవరికి?

Jul 24 2015 10:58 PM | Updated on Sep 3 2017 6:06 AM

ఆ అదృష్టం ఎవరికి?

ఆ అదృష్టం ఎవరికి?

తాజా సినిమా ‘బజ్‌రంగి బైజాన్’ హిట్‌తో మంచి ఊపు మీద ఉన్నాడు దబాంగ్‌ఖాన్ సల్మాన్‌ఖాన్.

గాసిప్
 
తాజా సినిమా ‘బజ్‌రంగి బైజాన్’ హిట్‌తో మంచి ఊపు మీద ఉన్నాడు దబాంగ్‌ఖాన్ సల్మాన్‌ఖాన్. ఇప్పుడు అందరి దృష్టి అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘సుల్తాన్’పై పడింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేదాని గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

 మొదట కంగనా రనౌత్‌ను అనుకున్నారు.. ఏమైందో ఏమోగానీ ‘‘నేను సుల్తాన్‌లో నటించడం లేదు’’ అని ఆమె ప్రకటించింది. ఆ తరువాత దీపికా పదుకునే, పరిణితి చోప్రాల పేర్లు వినిపించాయి. ‘‘సుల్తాన్ సినిమా స్పోర్ట్స్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్, కొత్త హీరోయిన్ నటించనున్నారు’’ అని ప్రకటించాడు సల్మాన్.

 ‘సుల్తాన్’ సినిమా కోసం తాజాగా మరోసారి  వినిపిస్తున్న పేరు కృతి సనన్. ‘1’ ‘దోచెయ్’ సినిమాలతో మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి సనన్‌కు ‘సుల్తాన్’లో అవకాశం వస్తే... ఇక ఆమె కెరీర్ రాత మారిపోవచ్చు. ప్రథమశ్రేణి హీరోయిన్‌ల జాబితాలో ఆమె పేరు చేరడం ఖాయం. ‘‘షారుక్ ఖాన్‌తో పని చేయడం ఎంత  ఇష్టమంటే...’’ అని నెల క్రితం షారుక్‌ఖాన్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది కృతి. ఇప్పుడు ఆ విషయాన్ని సల్లూబాయ్‌కి గుర్తుకు తెస్తే... మరో కొత్త హీరోయిన్ పేరు వినిపించవచ్చునేమో!
 

Advertisement
 
Advertisement
Advertisement