'నేను మళ్లీ నటిస్తున్నాను...' | Gossip | Sakshi
Sakshi News home page

'నేను మళ్లీ నటిస్తున్నాను...'

Jul 8 2015 11:57 AM | Updated on Apr 3 2019 6:23 PM

'నేను మళ్లీ నటిస్తున్నాను...' - Sakshi

'నేను మళ్లీ నటిస్తున్నాను...'

అనూ అగర్వాల్ పేరు వినబడగానే మణిరత్నం ‘దొంగా దొంగా’ సినిమాలో ‘కొంచెం నీరు..

అనూ అగర్వాల్ పేరు వినబడగానే మణిరత్నం ‘దొంగా దొంగా’ సినిమాలో ‘కొంచెం నీరు..’ పాట పెదాల మీద ఇప్పటికీ పలుకుతుంది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఆషికీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనూ అగర్వాల్‌కు ఆ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. ఈలోపే ఆమెను దురదృష్టం వెంటాడింది. 1999లో ముంబాయిలో ప్రమాదానికి గురై చాలారోజులు కోమాలో ఉంది. దేవుడి దయ వల్ల ఆమె మృత్యువు నుంచి బయటపడింది.

 ఆ తరువాత మాత్రం అగర్వాల్ రూపంలో మార్పులు వచ్చాయి. కొందరైతే ఆమెను గుర్తు కూడా పట్టలేదు.  తాజా వార్త ఏమిటంటే, ‘‘నేను మళ్లీ నటించనున్నాను’’ అని అనూ అగర్వాల్ సోషల్ నెట్‌వర్కింగ్ పేజీలో రాసింది. తన ఆటోబయోగ్రఫీ‘అనూజువల్-మెమరీ ఆఫ్ ఏ గర్ల్ హు కేమ్ బ్యాక్ ఫ్రమ్ ది డెడ్’ గురించి కూడా ప్రకటించింది.

ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది. ‘ఢిల్లీ యూనివర్శిటీ’ నుంచి సోషియాలజీలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న అగర్వాల్ మొదట్లో మోడలింగ్ చేసింది. మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్న ఆమె  ముందు అవకాశాలు క్యూ కట్టడం లేదుగానీ, అనూ అగర్వాల్ ‘ఆటోబయో గ్రఫీ’లోని విషయాల గురించి ఆ నోటా ఈ నోట విన్న ఒక దర్శకుడు ఆమెను కలిసి- ‘‘వేరే కథ ఎందుకు? మీ జీవితకథనే సినిమాగా తీద్దాం’’ అన్నాడట. అందుకు అగర్వాల్ ఒప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి!
 
 

Advertisement
 
Advertisement
Advertisement