ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పకండి

Goat And Tiger Secret Story - Sakshi

అదొక జంతు ప్రదర్శనశాల. అక్కడ ఒకే బోనులో ఓ పులి, మేక కలిసి ఉంటున్నాయి. ఈ విచిత్రాన్ని చూడడానికి రోజూ ప్రజలు అక్కడికి వచ్చేవారు. పులి నిద్రపోతున్నప్పుడు దాని పొట్టకు ఆనుకుని ఓ మేక విశ్రాంతి తీసుకుంటూ ఉన్న దృశ్యం చూసిన వారికి ఆశ్చర్యంగా ఉండేది.
ఓ మహిళ ఇది చూసి ఆశ్చర్యంతో ఆ ప్రదర్శనశాల నిర్వాహకులలోని ఓ ప్రతినిధితో ‘‘ఇదెలా సాధ్యమైంది?’’ అని ఎంతో ఆసక్తితో అడిగింది.
ఆరోజే ఆ ప్రతినిధి విధుల నుంచి రిటైర్‌ అవుతున్న రోజు. ఆయన ఆ మహిళతో నెమ్మదిగా చెప్పాడిలా...
‘‘ఇందులో రహస్యమేమీ లేదు. రోజూ ఓ మేకను మారుస్తుంటాం. ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పకండి’’ అన్నాడతను.
పులి ఇతర జంతువులను చంపి తినే క్రూరమృగమే. కాదనను. కానీ అది ఆకలి వేసినప్పుడు మాత్రమే తనకు అవసరమైన మేరకు మరొక జంతువును చంపుతుంది. ఆకలి తీరిపోతే అది మహాసాధువవుతుంది. ఇంకేదీ పట్టించుకోదు. ఎవరి మీదా దాడికి పూనుకోదు. కానీ మనిషే కారణం లేకున్నా సరే ఇతరులను నాశనం చేసే గుణం కలిగి ఉంటాడు. ఓ అణుబాంబుతో వేలాది మందిని హతమార్చగలడు. హిట్లర్‌ వంటి మనుషులే లక్షల మంది మరణానికి కారకులయ్యారు. అలాటి వారు ఎంతటి దుర్మార్గానికైనా వెనుకాడరు. – యామిజాల జగదీశ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top