క్యాన్సర్ల పాలిట సింహస్వప్నం... వెల్లుల్లి!

Garlic strains are many health benefits - Sakshi

ఆవకాయలోని నూనెలో నానిన వెల్లుల్లి రుచిని ఇష్టపడని వారు చాలా తక్కువ. వెల్లుల్లి ఘాటు అనేక ఆరోగ్యప్రయోజనాలు ఇస్తుంది.
వెల్లుల్లి జీర్ణక్రియ బాగా జరిగేలా తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థలో వాపు, మంటలను ఉపశమింపజేస్తుంది
 వెల్లుల్లిలోని ఘాటుదనం వల్ల అనేక క్యాన్సర్లను స్వాభావికంగా నివారించవచ్చు. పెద్దపేగు (కోలన్‌), పొట్ట, ఈసోఫేజియల్‌ క్యాన్సర్లతో పాటు రొమ్ము క్యాన్సర్‌ గడ్డలను వెల్లుల్లి తేలిగ్గా నివారిస్తుంది
వెల్లుల్లిలోని అల్లిసిన్‌ అనే కాంపౌండ్‌ చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంతో పాటు దాని దుష్ప్రభావాలను నివారిస్తుంది
వెల్లుల్లిలోని అల్లిసిన్‌లో రక్తనాళాలను విప్పార్చేలా చేసే గుణం ఉండటం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది ∙వెల్లుల్లిలోని ఔషధగుణాలు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉండేలా చేస్తాయి ∙వెల్లుల్లి జలుబు, దగ్గును దూరం చేస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను కాస్తంత నలిపి తింటే జలుబు తీవ్రత చాలావరకు తగ్గుతుంది
వెల్లుల్లిలోని సెలినియమ్, క్వార్సెటిన్, విటమిన్‌–సి పుష్కలంగా ఉండటం వల్ల అది గాయాలను సమర్థంగా మాన్పగలదు. అంతేకాదు... కంటికి వచ్చే ఇన్ఫెక్షన్లు, కళ్లవాపును తగ్గిస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top