మామూలుగా తన యాసలో మాట్లాడే ఓ వ్యక్తి అకస్మాత్తుగా ‘పొరుగు’యాసలో మాట్లాడితే ఎలా ఉంటుంది.
మెడిక్షనరీ
మామూలుగా తన యాసలో మాట్లాడే ఓ వ్యక్తి అకస్మాత్తుగా ‘పొరుగు’యాసలో మాట్లాడితే ఎలా ఉంటుంది. తన యాసలో ఉన్న మాటలనే పొరుగుయాసలో పలకబోయి పట్టుబడతాడు. అది అతడి మాతృభాష కాదని, పొరుగు భాషావ్యవహర్తలంతా గుర్తుపడతారు. ఈ రుగ్మత పేరే ‘ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్’.
ఇదొక మానసిక/నరాలకు సంబంధించిన రుగ్మత. ఇలా చేసే కొందరిలో ఎమ్మారై స్కానింగ్ రిపోర్టులను పరిశీలించినప్పుడు మెదడులోని భాష సెంటర్‌లో బేసల్ గ్యాంగ్లియాన్‌కు దెబ్బతగిలి ఉండటాన్ని డాక్టర్లు కొంతమందిలో గుర్తించారు. ఇలా మాట్లాడేవారు కేవలం మనదేశంలోనే గాక... జపనీస్‌ను కొరియా భాషలాగా, ఇంగ్లిష్‌ను ఫ్రెంచ్‌లాగా, స్పానిష్‌ను హంగేరియన్ లాంగ్వేజీలా మాట్లాడతారు.