రక్తహీనతను తగ్గించే అంజీర్‌! | Fig decrease anemia | Sakshi
Sakshi News home page

రక్తహీనతను తగ్గించే అంజీర్‌!

Nov 25 2017 1:39 AM | Updated on Nov 25 2017 1:40 AM

Fig decrease anemia - Sakshi - Sakshi

శుష్కఫలాల్లో (డ్రైఫ్రూట్స్‌లో) అంజీర్‌ది ప్రత్యేకమైన స్థానం. ఎంతో రుచిగా ఉండే వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.
♦ వీటిల్లో ఐరన్‌ చాలా ఎక్కువ. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి డాక్టర్లు అంజీర్‌ను సిఫార్సు చేస్తుంటారు
♦ ఫైబర్‌ ఎక్కువగా ఉండటంతో పాటు కొవ్వులు చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు అంజీర్‌ తినడం మంచిది.    
♦ అంజీర్‌లో పొటాషియమ్‌ ఎక్కువ. సోడియమ్‌ చాలా తక్కువ. అందువల్ల ఇది రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది.
♦ అంజీర్‌లో క్యాల్షియమ్‌ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవి బలంగా ఉండేలా చూస్తుంది.
♦ అంజీర్‌లో మంచి పోషకాలు ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement