ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోంది. ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇంధనం, ఆహారం, రవాణా, ఇతర నిత్యావసరాల ధరలు కూడా ఆకాశంవైపు చూస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇటీవలే నోయిడా నుండి బెంగళూరుకు మారిన వెంచర్ క్యాపిటలిస్ట్ (Venture Capitalist) సజిత్ పాయ్, తన నివాస ప్రాంతమైన ఇందిరానగర్‌లో బట్టల ఇస్త్రీ ధరలను చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట పెచర్చకు దారితీసింది.
సజిత్ పాయ్ ఏమన్నారంటే?
తాను గతంలో ఉన్న నోయిడాలో ఒక బట్ట ముక్క ఇస్త్రీ చేయడానికి కేవలం రూ. 5 మాత్రమే తీసుకునే వారని, బెంగళూరులో అంతకంటే కొంచెం ఎక్కువ ఉంటుందని తాను ఊహించానని పాయ్ కానీ ఈ రేంజ్‌లో ఊహించ లేదంటూ తన అనుభవాన్ని ఎక్స్‌లో షేర్ చేశారు.
తానే ఈ నెల ప్రారంభంలో బెంగళూరుకు మారాననీ, బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఒక బట్టకు రూ. 12 నుండి రూ. 20 వరకు వసూలు చేయడం నన్ను షాక్‌కు గురిచేసిందని వెల్లడించారు. ముంబై వంటి ఖరీదైన నగరం నుండి బెంగళూరుకు వచ్చిన వారు సైతం ఇక్కడి ఇస్త్రీ ధరలను చూసి ఆశ్చర్యపోతున్నారని ఆయన తెలిపారు. అంతేకాదు ఈ పెరుగుదలకు కారణాలను కూడా ఆయన విశ్లేషించారు.
I moved early this month to BLR, and one of the most surprising findings was the higher cost of ironing. Noida where I prev stayed was ₹5 per piece which I know is a bit on the lower side, so I was expecting slighly higher prices but prices of ₹12-20 per piece (admittedly this… pic.twitter.com/3uoLwwSfNu
— Sajith Pai (@sajithpai) May 27, 2026
LPG ఐరన్ బాక్సుల వాడకం: నోయిడా లేదా ఢిల్లీ (NCR) పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ సాంప్రదాయ బొగ్గు (Charcoal) ఐరన్ బాక్సులను ఎక్కువగా వాడుతుంటారు. కానీ బెంగళూరులోని ఇస్త్రీ వ్యాపారులు ఎక్కువగా ఎల్‌పీజీ (LPG) గ్యాస్‌తో నడిచే ఐరన్ బాక్సులను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఇస్త్రీ ఖర్చులు పెరిగాయి.
బొగ్గు లభ్యత: ఉత్తర భారతదేశంలో తందూరీ రెస్టారెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ బొగ్గు లభ్యత సులువుగా, తక్కువ ధరకే దొరుకుతుందని, అందుకే అక్కడ ఇస్త్రీ ధరలు తక్కువగా ఉండవచ్చని పాయ్ ఒక అంచనా వేశారు.
ఇదీ చదవండి: అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపు
నెటిజన్ల స్పందన
ఈ పోస్ట్‌పై స్పందిస్తూ దేశంలోని వివిధ నగరాల ప్రజలు తమ ప్రాంతాల్లోని ధరలను పంచుకున్నారు సూరత్ చెందిన యూజర్ మాట్లాడుతూ.. సూరత్‌లో సాధారణ ఇస్త్రీకి రూ. 10, స్టీమ్ ప్రెస్‌కు రూ. 25 తీసుకుంటారని, వారానికి 3 రోజులు ఉచితంగా ఇంటికే వచ్చి బట్టలు తీసుకెళ్లి ఇచ్చే సౌకర్యం కూడా ఉందని చెప్పారు.
సాధారణ ఇస్త్రీకి రూ. 7, స్టీమ్ ఇస్త్రీకి రూ. 20 వసూలు చేస్తున్నారని, ముంబై కంటే బెంగళూరు ఖరీదైనదిగా మారడం ఆశ్చర్యంగా ఉందని థానే యూజర్ పేర్కొన్నారు. ఇస్త్రీ అనేది శారీరక శ్రమతో కూడిన పని అని, వారు ఎలాంటి అదనపు వసూళ్లు చేయడం లేదని, వారి కష్టానికి తగ్గ ధరలే తీసుకుంటున్నారని కొందరు సమర్థించారు.శారీరక శ్రమతో కూడి అన్ని పనులలోనూ ఇలాంటి వ్యత్యాసమే ఉంది. ఇస్త్రీ, కారు శుభ్ర పరచడం, పనిమనిషి, వంటవాడు. ఇతర మెట్రో నగరాలతో, ముఖ్యంగా దక్షిణాదితో పోలిస్తే ఎన్‌సిఆర్‌లో ఇవన్నీ చౌకగా దొరుకుతాయని కామెంట్ చేశారు..
ఇదీ చదవండి: భార్యను రూ. 50 వేలకు అమ్మేశాడు.. 10 రోజులు నరకం


