ముడతల నివారణకు... వ్యాయామం | Exercise for the prevention of wrinkled ... | Sakshi
Sakshi News home page

ముడతల నివారణకు... వ్యాయామం

Oct 8 2014 10:28 PM | Updated on Sep 2 2017 2:32 PM

ముడతల నివారణకు... వ్యాయామం

ముడతల నివారణకు... వ్యాయామం

వేడి, చలి, దుమ్ము.. ఈ కారణాల వల్ల చర్మం పొడిబారుతుంటుంది. పొడి చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది.

ఫేస్ ఎక్సర్‌సైజ్
వేడి, చలి, దుమ్ము.. ఈ కారణాల వల్ల చర్మం పొడిబారుతుంటుంది. పొడి  చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది. రక్తప్రసరణ మెరుగై, చర్మకణాలు చురుకుదనం నింపుకోవాలంటే ముఖకండరాలకు వ్యాయామం అవసరం. బిగువు కోల్పోకుండా, చర్మం ముడతలు పడకుండా ఉండటానికి ఈ ‘ఫేసియల్ ఎక్సర్‌సైజ్’లు ఎంతగానో ఉపకరిస్తాయి.  పై పెదవి, కింద పెదవి లోపలికి మడచి, బుగ్గల నిండుగా గాలి తీసుకోవాలి.
 
రెండు చూపుడు వేళ్లతో పెదవుల చివర్లను పట్టుకొని, సాగదీసి, తర్వాత వదిలేయండి. ఇలా 5-6 సార్లు చేయాలి.
 
కనుబొమ్మలను పైకి లేపుతూ, నుదురు భాగపు చర్మాన్ని సాధ్యమైనంత వరకు సాగదీసి, వదిలేయాలి. ఇలా 5-6 సార్లు, రోజులో ఉదయం, పగలు, సాయంత్రం చేయవచ్చు.
 
రాత్రి పడుకునేముందు అరటిపండు గుజ్జులో ఆలివ్ ఆయిల్ కలిపి, ముఖానికి మసాజ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ముడతలు రావు.
 

Advertisement
 
Advertisement
Advertisement