రారండోయ్‌

Events in Hyderabad - Sakshi

‘రెండు దశాబ్దాల తెలంగాణ సాహిత్యం – సమాలోచన’(1996–2016) సదస్సు మార్చి 6, 7 తేదీల్లో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల, గజ్వేల్‌లో జరగనుంది.

‘వాడ్రేవు వీరలక్ష్మీదేవి సాహిత్య స్ఫూర్తి సదస్సు మరియు ‘భారతీయ నవలాదర్శనం’ ఆవిష్కరణ మార్చి 11న ఉదయం 10 గంటలకు మధుమహాలక్ష్మి కల్చరల్‌ సెంటర్, మొగల్రాజపురం, విజయవాడలో జరగనున్నాయి. నిర్వహణ: చినుకు పబ్లికేషన్స్‌.

‘ధ్వని’ మహిళా కవయిత్రుల కవితా పఠన కార్యక్రమం మార్చి 11న ఉదయం 10:30కు తెలంగాణ స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీలో జరగనుంది. నిర్వహణ: తెలంగాణ సాహిత్య సమాఖ్య.

‘జ్ఞాపకాల్లో ఇంద్రవెల్లి’ కవితాసంపుటి కోసం రచనలను ఆహ్వానిస్తున్నారు. మెయిల్‌: gyapakalloindravelli@gmail.com వివరాలకు: ఎస్‌.సుధాకర్, ఫోన్‌: 9246216234

మద్దూరి నగేశ్‌బాబు, పైడి తెరేశ్‌బాబు, కలేకూరి ప్రసాద్‌ జ్ఞాపకార్థం ఇవ్వనున్న ‘ధిక్కార దళిత కవిత్రయ’ అవార్డు కోసం దళిత కవులు తమ కృషిని తెలియజేస్తూ వారి సంకలనాలు పంపాల్సిందిగా దళిత సాహిత్య వేదిక ఆహ్వానిస్తోంది. పురస్కార నగదు 50 వేలు. వివరాలకు: పిల్లి మల్లికార్జున్, ఫోన్‌: 8096353324

‘ఎవ్రీ డే విమెన్‌’ ఛాయాచిత్ర ప్రదర్శనను హైదరాబాద్‌లోని సామాన్య శాస్త్రం గ్యాలరీలో మార్చి 6న సా. 6 గంటలకు మామిడి హరికృష్ణ ప్రారంభిస్తారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top