కాలుష్యంతోనే  కరెంటు, హైడ్రోజన్‌..

electricity, hydrogen with Pollution   - Sakshi

ఒక్కదెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో. వాతావరణంలో పెరిగిపోతున్న కార్బన్‌డయాౖMð్సడ్‌ వాయువును తొలగించడంతోపాటు అటు కరెంటు ఇటు స్వచ్ఛమైన ఇంధనం హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు జార్జియా, ఉల్సాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఒక కొత్త విధానాన్ని కనుక్కున్నారు. హైబ్రిడ్‌ ఎన్‌ఏ–సీఓ2 అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీలో కార్బన్‌డయాక్సైడ్‌ వాయువును ద్రవంతో నిండిన ఓ పరికరంలోకి  పంపుతారు. ఈ తొట్టిలో కాథోడ్‌ను ఉంచి.. పక్కనే ఎలక్ట్రోలైట్‌లో సోడియంతో తయారైన ఆనోడ్‌ను ఉంచుతారు.

కార్బన్‌డయాక్సైడ్‌ ప్రవహించినప్పుడు అది కాథోడ్‌తో చర్య జరిపి ద్రవాన్ని మరింత ఆమ్లయుతం చేస్తుంది. ఫలితంగా అక్కడికక్కడ కరెంటుతోపాటు హైడ్రోజన్‌ కూడా ఉత్పత్తి అవుతుంది. వాడే కార్బన్‌డయాౖMð్సడ్‌లో కనీసం 50 శాతాన్ని కరెంట్, హైడ్రోజన్‌ రూపంలో వాడుకోవచ్చునని ఎలక్ట్రోడ్‌లకు ఏమాత్రం హాని జరక్కుండా ఈ పరికరాన్ని వెయ్యి గంటలపాటు వాడుకోవచ్చునని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కిమ్‌ తెలిపారు. మిగిలిన సీఓ2ను కూడా ద్రవం నుంచి వేరుచేసి మళ్లీ వాడుకోవచ్చునని తెలిపారు. కొన్ని మార్పులు, చేర్పుల ద్వారా ప్రస్తుత డిజైన్‌ను మరింత మెరుగుపరిచే అవకాశం ఉందని.. ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్‌ను వాహనాల్లో వాడుకోవచ్చునని తెలిపారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top