మోచేతుల నలుపు తగ్గాలంటే | Elbows are black Know | Sakshi
Sakshi News home page

మోచేతుల నలుపు తగ్గాలంటే

Feb 26 2015 11:27 PM | Updated on Sep 2 2017 9:58 PM

మోచేతుల   నలుపు తగ్గాలంటే

మోచేతుల నలుపు తగ్గాలంటే

రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసి, పది నిమిషాలు ఉంచాలి.టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి

రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసి, పది నిమిషాలు ఉంచాలి.టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి వేడి టవల్‌తో తుడవాలి.  రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి.పాల మీగడలో చిటికెడు పసుపు రాసి, నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి.
  టొమాటో రసం లేదా దానిమ్మ రసం తేనె లేదా నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్ది, శుభ్రపరుచుకుంటే నలుపు సులువుగా తగ్గుతుంది.

నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వారానికోసారి స్నానానికి నువ్వుల నూనె ఉపయోగించడం వల్ల చర్మానికి కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్ అంది, మృదువుగా అవుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement