కోర్టులో‘లగాన్‌’ నటుడు

Divorce Case Facing Lagaan Actor Raghuveer Yadav - Sakshi

సినీ విడాకులు

‘ముంగేరిలాల్‌ కే హసీన్‌ సప్నే’ సీరియల్‌ ద్వారా టీవీ ప్రేక్షకులకు, ‘లగాన్‌’ వంటి అనేక సినిమాల ద్వారా సినిమా ప్రియులకు సుపరిచతుడైన నటుడు రఘువీర్‌ యాదవ్‌ విడాకుల కేసును ఎదుర్కొంటున్నాడు.

రఘువీర్‌ యాదవ్, పూర్ణిమ
1988లో వివాహం చేసుకున్నారు. పూర్ణిమ అంతర్జాతీయ స్థాయి కథక్‌ డాన్సర్‌ అయితే1995 నుంచే వారు విడివిడిగా ఉంటున్నారు. వీళ్లకు ఒక కుమారుడనీ అతనికిప్పుడు 30 ఏళ్లు అనీ తల్లితోనే ఉంటున్నాడని ముంబై మిర్రర్‌ పత్రిక రాసింది.

రఘువీర్‌ యాదవ్‌ భారతీయ నాటకరంగంలో చాలా పెద్ద పేరు. టెలివిజన్‌ రంగంలో ‘ముల్లా నసీరుద్దీన్‌’, ‘అమరావతి కే కహానియా’ వంటి ఎన్నో సీరియల్స్‌లో పని చేశాడు. ‘సలాం బాంబే’, ‘రుడాలీ’, ‘బాండిట్‌ క్వీన్‌’ సినిమాలలో ముఖ్య పాత్రలు ధరించాడు. ‘డియర్‌ ఫ్రెండ్‌ హిట్లర్‌’ సినిమాలో హిట్లర్‌ పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు 62 సంవత్సరాల వయసులో కోర్టు మెట్లు ఎక్కనున్నాడు. అతడి భార్య అతడి నుంచి చట్టపరంగా విడిపోవడానికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు నమోదు చేసింది. విడాకులు మంజూరు అయ్యేంత వరకు నెలకు లక్ష రూపాయల ఇంటిరియమ్‌ మెయింటెన్స్, మంజూరయ్యాక పది కోట్ల పరిహారం రఘువీర్‌ యాదవ్‌ నుంచి కోరుతోంది.

రఘువీర్‌ యాదవ్, పూర్ణిమ 1988లో వివాహం చేసుకున్నారు. పూర్ణిమ అంతర్జాతీయ స్థాయి కథక్‌ డాన్సర్‌ అయితే 1995 నుంచే వారు విడివిడిగా ఉంటున్నారు. వీళ్లకు ఒక కుమారుడు అనీ, అతనికిప్పుడు 30 ఏళ్లు అనీ, తల్లితోనే ఉంటున్నాడని ముంబై మిర్రర్‌ పత్రిక రాసింది. ‘అతడు వేరొకరితో సంబంధం పెట్టుకొని నన్ను మోసం చేశాడు’ అని పూర్ణిమ ఆరోపిస్తోంది. రఘువీర్‌ యాదవ్‌ మేనేజర్‌ రోష్నీ అర్చెజాను ఇందుకు కారణంగా చెబుతోంది. ‘ప్రస్తుతం అతను నెలకు నలభై వేల రూపాయలు ఖర్చులకు ఇస్తున్నాడు. అవి కూడా సరిగ్గా సమయానికి ఇవ్వడు. నాకు న్యాయం కావాలి’ అని పూర్ణిమ తన పిటిషన్‌లో పేర్కొంది. ‘ఎక్కడ భరణం ఇవ్వాల్సి వస్తుందో అని ఆస్తులు రోష్నీ పేరు మీద మార్చేశాడు’ అని కూడా పూర్ణిమ చెప్పింది.

ఈ విషయమై రఘువీర్‌ యాదవ్‌ను సంప్రదించగా ‘ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించను. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది’ అని ఊరుకున్నాడు. 2017లో సూపర్‌ హిట్‌ అయిన సినిమా ‘న్యూటన్‌’లో రఘువీర్‌ యాదవ్‌ కార్డ్స్‌ ఆడుతూ కనిపించే ఎన్నికల అధికారిగా నటించాడు. ప్రస్తుతం అతడికి మంచి ముక్క పడట్లేదని మాత్రం ఈ ఉదంతం తెలియచేస్తోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top