
2వ పాశురం వైయత్తు వాళ్‌వీర్‌కాళ్ నాముమ్ నమ్ పావైక్కు చ్చెయ్యుమ్ కిరిశైకళ్ కేళీరో! పాఱ్కడలుళ్ పైయత్తు యిన్ర పరమనడి పాడి నెయ్ ఉణ్ణోమ్ పాల్ ఉణ్ణోమ్ నాట్కాలేనీరాడి మై యిట్టెళుతోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్ శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళై శెన్రు ఓదోమ్ ఐయముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయూమ్ కై కొట్టి ఉయ్యూ మాఱెణ్ణి ఉగన్దు ఏలో రెంబావాయ్
శ్రీకృష్ణుడు అవతరించిన కాలంలో ఈ భూలోకంలో పుట్టి దుఃఖమయమైన ఈ సంసారంలో కూడా ఆనందాన్నే పొందుతున్న ఓ అదృష్టవంతులారా! మేము ఆచరించే ఈ తిరుప్పావై వ్రతానికి అవసరమైన క్రియాకలాపాన్ని తెలుపుతాను శ్రద్ధతో వినండి. తెల్లవారు ఝాముననే లేచి స్నానం చేసి పాలసముద్రంలో మెల్లగా పడుకొని ఉన్న పరమాత్మ పాదాలకు మంగళారతినిస్తాను.
ఈ వ్రత సమయంలో నెయ్యిని పాలను స్వీకరించం. కంటికి కాటుకను, తలలో పూలను ధరించం. పెద్దలు ఆచరించని పనులను చేయం. అసత్యాలను, కఠినమైన మాటలను మాట్లాడం. ఆత్మజ్ఞానంతో ప్రకాశించే మహనీయులను సత్కరిస్తాం. బ్రహ్మచారులకు యతీశ్వరులకు భిక్షను అందిస్తాం. ఉద్ధరింపబడే విధాన్ని పర్యాలోచన చేస్తాము.
– ఎస్. శ్రీప్రియ