శరీర నిర్మాణం... వివరంగా! | details of the structure of the body | Sakshi
Sakshi News home page

శరీర నిర్మాణం... వివరంగా!

Apr 28 2015 10:57 PM | Updated on Sep 3 2017 1:02 AM

శరీర నిర్మాణం... వివరంగా!

శరీర నిర్మాణం... వివరంగా!

సంక్లిష్టమైన మానవ శరీర నిర్మాణాన్ని, అవయవాలను సూక్ష్మస్థాయిలో చూడటం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.

సంక్లిష్టమైన మానవ శరీర నిర్మాణాన్ని, అవయవాలను సూక్ష్మస్థాయిలో చూడటం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చుగానీ.. వైద్య విద్యార్థులకు మాత్రం వరమేనని చెప్పాలి. అలాంటి వారి కోసం రూపొందించిన అప్లికేషన్ ఈ అనాటమీ 4డీ.

దీంట్లోని లైబ్రరీ నుంచి మీకు నచ్చిన చిత్రాన్ని తీసుకుని ప్రింట్  చేయడం ద్వారా ఈ అప్లికేషన్ తన పని మొదలుపెడుతుంది. స్కాన్ చేసిన చిత్రాన్ని టేబుల్‌పై ఉంచి స్కాన్ చేశారనుకోండి. ఆ చిత్రంలోని అన్ని అవయవాలు సూక్ష్మ వివరాలతో కనిపిస్తాయి. కేవలం చూడటానికి మాత్రమే కాకుండా... వాటి నుంచి ప్రయాణం చేస్తున్న అనుభూతి కల్పించడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత.
 

Advertisement
 
Advertisement
Advertisement