
నొప్పి లేకుండా రూట్‌కెనాల్ చేయవచ్చు
పుచ్చు అనేది మొదటి దశలో పంటి మీద ఒక నల్లటి మచ్చలాగా ఏర్పడుతుంది. ఈ దశలో మనకి అసలు నొప్పి ఉండదు. తర్వాత గుంట లాగా ఏర్పడుతుంది. అప్పుడు మనం తీసుకునే పదార్థం దానిలో ఇరుక్కుంటుంది.
పుచ్చు అనేది పంటికి ఎలా వ్యాపిస్తుంది? దాని కారణాలు ఏమిటి?
దీనికి అనేక కారణాలు ఉంటాయి. 1. వంశపారంపర్యంగా 2) బ్రషింగ్ సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల 3) మన ఆహారపు అలవాట్ల వల్ల, పైన పేర్కొన్న పద్ధతుల ద్వారా పుచ్చు వ్యాఫ్తి చెందుతుంది.
పుచ్చు ఏ లక్షణాలు కలిగి ఉంటుంది.?
పుచ్చు అనేది మొదటి దశలో పంటి మీద ఒక నల్లటి మచ్చలాగా ఏర్పడుతుంది. ఈ దశలో మనకి అసలు నొప్పి ఉండదు. తర్వాత గుంట లాగా ఏర్పడుతుంది. అప్పుడు మనం తీసుకునే పదార్థం దానిలో ఇరుక్కుంటుంది. ఈ క్రమం ఇలాగే కొనసాగినట్లైతే అది మెల్లగా పంటి మూడో పొర అనగా పల్స్‌కి వ్యాపిస్తుంది. అప్పుడు పంటిలో నొప్పి మొదలై పంటి మూలానికి వ్యాపిస్తుంది.
పుచ్చు పళ్ళకి ట్రీట్‌మెంట్ ఏవిధంగా ఉంటుంది.?
1. మొదటి దశలో పుచ్చుకి ట్రీట్‌మెంట్-నల్లగా మచ్చగా ఏర్పడిన ప్రాంతాన్ని శుభ్రపరిచి సిమెంట్‌తో నింపుతారు. పంటి పల్ప్ గనుక ఇన్‌ఫెక్ట్ అయితే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయాలి.
రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ పద్ధతి ఏమిటి? అది ఎలా చేస్తారు.?
ఇందుకు ముందుగా పంటిలో ఇన్‌ఫెక్ట్ అయిన నరాన్ని మొత్తం తొలగించాలి. ఆ తర్వాత ఇన్‌ఫెక్షన్ అంతా పోయిందని నిర్థారించుకొని ఆ భాగాన్ని మెడికేటెడ్ పదార్థంలో నింపుతారు. ఆ తర్వాత ఆ పంటి పైన క్యాప్ ఇస్తారు.
రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్‌లో ఆధునిక పద్ధతులు ఏమిటి?
1) రోటరీ రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ 2) లేజర్ ద్వారా రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్.
ఆధునిక రూట్‌కెనాల్ పద్ధతుల ద్వారా ఉపయోగాలు ఏమిటి?
వీటిద్వారా ఇన్‌ఫెక్షన్‌ని తక్కువ సమయంలో తొలగించవచ్చు. దీని ద్వారా ట్రీట్‌మెంట్ చాలా తక్కువ సమయంలో ఏ ఇబ్బందీ లేకుండా పూర్తి అవుతుంది.
...పాజిటివ్ డెంటల్
డా. సృజనారెడ్డి గారు, సీనియర్ డెంటల్ సర్జన్
www.positivedental.com
హైదరాబాద్:
ఎస్.ఆర్. నగర్ - (9246567874)
ఎ.ఎస్. రావు నగర్ -(9248112224)
దిల్‌సుఖ్‌నగర్- (9290900996)
మాదాపూర్- (9248041001)
కెపిహెచ్‌బి- (9290901003)
నిజాంపేట- (9246211006)
కర్నూల్- (9290909003)