చల్లదనంలో... తెల్లదనం..! | buety tips for skin and colour | Sakshi
Sakshi News home page

చల్లదనంలో... తెల్లదనం..!

Jul 24 2016 12:21 AM | Updated on Sep 4 2017 5:54 AM

చల్లదనంలో... తెల్లదనం..!

చల్లదనంలో... తెల్లదనం..!

వర్షాకాలంలో చల్లదనం పెరిగేకొద్దీ చర్మం నల్లబడుతూ ఉంటుంది. కాళ్లూచేతుల విషయంలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. దీన్నుంచి బయటపడాలంటే...

వర్షాకాలంలో చల్లదనం పెరిగేకొద్దీ చర్మం నల్లబడుతూ ఉంటుంది. కాళ్లూచేతుల విషయంలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. దీన్నుంచి బయటపడాలంటే...

పచ్చిపాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి పాలలో దూదిని ముంచి, దాంతో కాళ్లూ చేతులూ బాగా రుద్దుకుని. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే చర్మం నల్లగా అవ్వదు.

నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేయాలి. దీనిలో పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని కాళ్లు, చేతులకు పట్టించి... ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.

ఓ చెంచాడు గంధపు పొడిలో చెంచాడు టొమాటో గుజ్జు, చెంచాడు నిమ్మరసం, చెంచాడు కీరాదోస రసం కలిపి కాళ్లు, చేతులకు రాసుకుని... పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

నాలుగైదు బాదం గింజలను రాత్రి నీటిలో నానబెట్టాలి. ఉదయం తొక్క తీసేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పాలు, కొన్ని చుక్కల నిమ్మరసం, చెంచాడు శెనగపిండి కలపాలి. ఈ  మిశ్రమంతో కాళ్లనూ చేతులనూ బాగా తోముకుని తర్వాత స్నానం చేస్తే ఫలితముంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement