బయో ఫ్యాషన్ షో | Bio Fashion Show | Sakshi
Sakshi News home page

బయో ఫ్యాషన్ షో

Nov 25 2016 11:06 PM | Updated on Sep 4 2017 9:06 PM

బయో ఫ్యాషన్ షో

బయో ఫ్యాషన్ షో

ఆకు కూరలు తినండి... ఆరోగ్యానికి మంచిది, పచ్చదనాన్ని కాపాడండి... ఒంటికి మంచిది, చెట్లను పెంచండి...

ఆకు కూరలు తినండి... ఆరోగ్యానికి మంచిది, పచ్చదనాన్ని కాపాడండి... ఒంటికి మంచిది, చెట్లను పెంచండి... వర్షానికి మంచిది, పశు పక్ష్యాదులను కనికరించండి... పర్యావరణానికి మంచిది అని ఊరకే మాటలు చెప్పడం కాదు. దాన్ని ఫ్యాషన్‌లో కూడా చూపిద్దామనుకున్నాడు ఫ్యాషన్ డిజైనర్ బ్రహ్యాన్ కాస్తనెదా.

కొలంబియాకు చెందిన ఈ డిజైనర్ గత వారం ఆ దేశంలో కేవలం ఆర్గానిక్ ఉత్పత్తులను ఉపయోగించి తయారు చేసిన దుస్తులు డిజైన్లతో ఒక షో ఏర్పాటు చేశాడు. పాల్గొన్న అందగత్తెలందరూ కూరగాయల టోపీలూ, ఆకుకూరల మిడ్డీలు ధరించి ర్యాంప్ మీద వాక్ చేస్తుంటే చూసేవాళ్లకు ఒక రైతుబజారే ఎదురుగా నిలుచున్నట్టుగా అనిపించిందట. ఏమైనా ఈ ట్రెండ్ బాగానే ఉంది. ఫ్యాషన్‌కు ఫ్యాషన్... చైతన్యానికి చైతన్యం.

Advertisement
 
Advertisement
Advertisement