ముప్ఫై దాటాక...

beauty tips - Sakshi

బ్యూటిప్స్‌

ముప్ఫై దాటిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు... డబుల్‌ చిన్, కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారడంతోపాటు మెడ, చేతులు వార్థక్య చిహ్నాలను ప్రతిబింబించడం మొదలవుతుంది. వాటిని నివారించడానికి...   డ్రైస్కిన్‌ అయితే ఒక టేబుల్‌ స్పూన్‌ ఆయిల్, రెండు టేబుల్‌ స్పూన్ల పాలు తీసుకుని గోరువెచ్చగా చేసి అందులో చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్‌ను ముంచి ముఖం, మెడకు అప్లయ్‌ చేసి తుడిచేయాలి. ఇది క్లెన్సర్‌గా మురికిని తొలగించడంతో పాటు మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.

జిడ్డు చర్మం అయితే ఒక టేబుల్‌ స్పూన్‌ స్కిమ్‌డ్‌ మిల్క్‌లో నీటిని కలిపి పలుచగా చేయాలి. ఇందులో కాటన్‌ ముంచి ముఖానికి, మెడకు అప్లయ్‌ చేసి టిష్యూ పేపర్‌తో తుడిచేయాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడుసార్లు చేయాలి. ఇది చక్కని క్లెన్సర్‌గానే కాకుండా చర్మాన్ని మృదువుగా మార్చి ముడతలు పడకుండా కాపాడుతుంది. రోజూ రాత్రి నెయ్యి లేదా బేబీ ఆయిల్‌ రాస్తుంటే కళ్ల చుట్టూ ఉన్న చర్మం కాంతిమంతంగా ఉండి వార్ధక్య లక్షణాలను సంతరించుకోదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top