కోమలమైన చర్మం

beauty tips - Sakshi

సౌందర్యం

పేరుకుపోయిన దుమ్ము కణాలను శుభ్రపరచకపోతే మృతకణాలు పెరిగి చర్మ మృదుత్వాన్ని, కాంతిమంతాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ సమస్యకు విరుగుడుగా... బియ్యప్పిండి, పసుపు, పాల మీగడ, నిమ్మరసం కలిపి పేస్ట్‌ చేయాలి.  ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసి, మృదువుగా రబ్‌ చేయాలి. దీని వల్ల స్వేదరంధ్రాల్లో మృతకణాలు తొలగిపోయి, సహజమైన మాయిశ్చరైజర్‌ని తగినంతగా ఉత్పత్తి చేస్తుంది. చర్మం మృదుత్వం దెబ్బతినదు.వాతావరణం మబ్బుగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ని రాసుకోవాలి.  రాత్రిపూట పెదవులకు పాల మీగడ, లేదా కొబ్బరి నూనె వంటివి రాసుకుంటే పగుళ్ల సమస్య బాధించదు.  సబ్బు అవసరం లేకుండా గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. జాజికాయను పొడిచేసి, అందులో పచ్చి పాలు కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు, మచ్చలు అయిన చోట రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. 

ఒక గిన్నెలో టేబుల్‌ స్పూన్‌ చొప్పన ఉల్లి, క్యారెట్‌ రసం, గుడ్డు సొన, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని యాక్నె, మొటిమలు ఉన్న చోట రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. యాక్నె, మొటిమలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది.ఆపిల్‌ ముక్కతో ముఖమంతా మృదువుగా రబ్‌ చేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ముఖంలోని అదనపు జిడ్డు తొలగిపోవడంతో మొటిమలు  తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది. జిడ్డు చర్మం గలవారు కీరా రసంలో రోజ్‌వాటర్, నిమ్మరసం కలపాలి. రాత్రి పడుకోబోయేముందు ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ముఖానికి రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top