
పెరుగులో ఒక స్పూను తేనె, రెండు స్పూన్ల నిమ్మకాయరసం కలిపి తలకి పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగులో ముల్తానమట్టి కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే చర్మంపై మురికిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది.
పెరుగులో పంచదార గాని, ఉప్మారవ్వ గాని కలిపి ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే మృతకణాలు తొలగి పోతాయి. మీగడ పెరుగును వేళ్లతో మెత్తగా చేసి ముఖం, చేతులు, పాదాలకు పట్టించి ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే డ్రై స్కిన్ మృదువుగా మారుతుంది.