అందమె ఆనందం | Beauty and pleasure | Sakshi
Sakshi News home page

అందమె ఆనందం

Jan 31 2018 12:08 AM | Updated on Jan 31 2018 2:24 PM

Beauty and pleasure - Sakshi

పావు టేబుల్‌ స్పూన్‌ తేనెలో  రెండుటేబుల్‌ స్పూన్ల పచ్చిపాలను కలపాలి. దూదిని ఈ మిశ్రమంలో ముంచి దాంతో ముఖమంతా రాయాలి. ఈ మిశ్రమం మంచి క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. కాలుష్యం వల్ల పేరుకుపోయే మలినాలు దీని వల్ల త్వరగా తొలగిపోతాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చర్మం శుభ్రపడుతుంది. కొద్ది రోజుల్లోనే ముఖ ఛాయలో మార్పుని గమనించవచ్చు. అర టీ స్పూన్‌ తేనెని స్నానం చేసే నీటిలో కలపాలి. ఈ నీటితో స్నానంచేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

తేనెలో నిమ్మరసాన్ని కలిపి ముఖంపై మృదువుగా పదిహేను నిమిషాలపాటు మసాజ్‌ చేసి చన్నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. పచ్చిపాలలో బాదం పొడిని కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయం ఈ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లా వాడితే చర్మ కాంతి నిగనిగలాడుతుంది. శనగపిండిలో పసుపు, గ్లిజరిన్, రోజ్‌ వాటర్‌ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరిస్తే చర్మం నునుపుగా తయారవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement