కిడ్నీ సమస్యలకు బీన్స్, తులసి, ద్రాక్ష

Beans, basil, grapes for kidney problems - Sakshi

హెల్దీ ఫుడ్‌

ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడాలేకుండా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఆహార అలవాట్లు, జీవన విధానంలో మార్పుతో ఈ సమస్య సాధారణంగా మారింది. ఈ సమస్య రాకుండా, అప్పటికే సమస్య ఉంటే అది పెద్దది కాకుండా చూసుకోవాలంటే అది మన చేతిలో పనే. 

కిడ్నీ బీన్స్‌(రాజ్మా): ఈ బీన్స్‌ మన నాలుకకు ఎంత రుచిని ఇస్తాయో, ఆరోగ్యానికి అంతకన్నా ఎక్కువ మేలు చేస్తాయి. నాలుగు లీటర్ల నీటిలో మధ్యకు చీల్చిన అరవై గ్రాముల బీన్స్‌ గింజలను వేయాలి. ఈ నీటిని నాలుగు గంటలపాటు సన్నటి మంట మీద ఉంచి మరగనివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని సుమారు 8 గంటల పాటు చల్లబరచాలి. చల్లారిన మిశ్రమాన్ని మళ్లీ వడకట్టుకోవాలి. రోజులో రెండు గంటలకోసారి ఈ డికాషన్‌ను గ్లాసు చొప్పున తీసుకోవాలి. ఇలా వారంలో కొన్నిసార్లు తీసుకోవాలి. డికాషన్‌ తయారయిన 24 గంటలలోపే అది ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు, గాల్‌ బ్లాడర్‌లో సమస్యలు, ఏ ఇతర సమస్యలున్నా ఇది మంచి  చిట్కా.

తులసి ఆకులు: తులసి ఆకులకు ఒక టీస్పూన్‌ తేనె కలిపి జ్యూస్‌ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్‌ని ఆరునెలల పాటు ప్రతి రోజు తీసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీలోని రాళ్ల పరిమాణం తగ్గి యూరిన్‌ ద్వారా బయటకు వచ్చేస్తాయి.

ద్రాక్ష: ద్రాక్షలో అధిక శాతం నీరు, పొటాషియం, సాల్ట్‌ ఉంటాయి. ఇవి మూత్రపిండ సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే పుచ్చకాయ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్య తలెత్తదు. ఇది చాలా సురక్షితమైనది కూడా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top