సమ్మర్‌లో స్విమ్మింగ్‌ అంటే అందరికీ ఇష్టమే.. మరి జాగ్రత్తలు? | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో స్విమ్మింగ్‌ అంటే అందరికీ ఇష్టమే.. మరి జాగ్రత్తలు?

Published Wed, Mar 29 2017 11:48 PM

సమ్మర్‌లో స్విమ్మింగ్‌ అంటే అందరికీ ఇష్టమే.. మరి జాగ్రత్తలు?

స్విమ్మింగ్‌కు వెళ్లే వారు చెవుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు చెవుల్లోకి ప్రవేశించి చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి వీలైతే ఇయర్‌ప్లగ్స్‌ పెట్టుకోవాలి. ఈత పూర్తయ్యాక పొడిబట్టతో చెవులు శుభ్రం చేసుకోవాలి.  స్విమ్మింగ్‌పూల్స్‌లో క్రిమిసంహారిణిగా క్లోరిన్‌ వంటి రసాయనాలు కలుపుతుంటారు. ఈ క్రిమిసంహార రసాయనాలు కొందరి చర్మంపై దుష్ప్రభావం చూపేందుకు  అవకాశం ఉంది. ఈత కొట్టే సమయంలో చాలా మంది మునిగి ఈత కొడుతూ నీళ్లలోపల కళ్లు తెరుస్తుంటారు.

సాధారణంగా దీని వల్ల సమస్య లేకపోయినా... ఒక్కోసారి నీళ్లను శుభ్రంగా ఉంచేందుకు వాడే క్లోరిన్‌ వంటి రసాయనాలు కళ్లలోకి వెళ్లడం వల్ల కంటికి మంట రావచ్చు.ఒక్కోసారి బట్టలు మార్చుకునే చోట్ల అపరిశుభ్రత వల్ల కూడా పాదాలకు ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. ఒక్కోసారి వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ కూడా రావచ్చు. అందుకే ఆ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి.

నీళ్లలో ఎక్కువసేపు నానుతూ ఉండటం వల్ల శరీరంలోని లవణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటిప్పుడు చర్మం ముడతలు పడిపోయే అవకాశాలు ఉండవచ్చు. దీన్ని నివారించాలంటే ఈత పూర్తయిన వెంటనే చర్మానికి మాయిష్చరైజింగ్‌ క్రీమ్‌ రాయాలి.

Advertisement
 
Advertisement