బాత్‌రూమ్‌ లేని హీరోయిన్‌ | Amala Paul house in Puducherry is a single room | Sakshi
Sakshi News home page

బాత్‌రూమ్‌ లేని హీరోయిన్‌

Nov 23 2017 11:34 PM | Updated on Nov 23 2017 11:34 PM

Amala Paul house in Puducherry is a single room - Sakshi

‘నా సౌందర్య రహస్యం లక్స్‌’... అని నున్నటి జబ్బల మీద సబ్బును వయ్యారంగా రాసుకుంటూ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చే హీరోయిన్లని కదా చూశాం. హీరోయిన్‌ అంటే డబ్బుంటుంది... లగ్జరీ ఉంటుంది... లంకంత బాత్‌రూములు ఉంటాయి... వాటిలో గండిపేట చెరువంత బాత్‌టబ్‌లుంటాయని మన ఎక్స్‌పెక్టేషన్‌. కాని అమలాపాల్‌ ఇంట్లో బాత్‌రూమే లేదట. మరి ‘ఠండే ఠండే పానీసే నహానా చాహియే’.. అని అమ్మడు ఎక్కడ జలకాలాడుతుందా అని అధికారులకు డౌటనుమానం వచ్చేసింది.

అసలు సంగతి ఏమిటంటే అమలాపాల్‌ కొత్త కారు కొనుక్కుని పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్‌ పెట్టుకుంది. అందుకోసమని ఒక లోకల్‌ అడ్రస్‌ కూడా పడేసింది. కాని అధికారులు చెక్‌ చేస్తే అదొక పిచ్చి ఇల్లు. దానికి బాత్‌రూమ్‌ కూడా లేదు. చెన్నైలోనో తిరువనంతపురంలోనో రిజిస్టర్‌ చేయించుకుంటే టాక్స్‌ బాగా పడుతుందని పాండిచ్చేరిలో నాలుగు డబ్బుల్స్‌ మిగులుతాయని అమలా ఆశా దోశా అప్పడం. కాని బండారం బయటపడటంతో ఆ అప్పడం కాస్త పచక్‌మంది. కొత్త టైరుకు గాలి తీసేసినట్టయ్యింది. సరైన నివాస పత్రాలు లేకుండా రిజిస్ట్రేషను జాన్తానై అని చెప్పడానికి అధికారులు టైలు, నడుం మీద బెల్టులు సరి చేసుకుంటూ బయల్దేరారు. అదీ సంగతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement