అతనితో బ్రేకప్?

అతనితో బ్రేకప్? - Sakshi


గాసిప్

 


బాలీవుడ్‌లో ప్రేమజంటలకు ఏమైంది? ఇప్పుడు గాసిప్ రాయుళ్లకు క్రేజీ టాపిక్.  రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కేస్తామంటూ ఊరించిన రణ్‌బీర్-కత్రినాకైఫ్‌లు బ్రేకప్ చెప్పేసుకుని విడిపోతే, ఆ తర్వాత అనుష్కా శర్మ-విరాట్ కొహ్లీలు కూడా వారి బాటనే అనుసరించారు. ఇప్పుడీ లిస్ట్‌లో ఆలియా భట్-సిద్ధార్థ మల్హోత్రాలు చేరనున్నారనే వార్త బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ‘స్టూడెంట్ ఆఫ్  ద ఇయర్’ చిత్రంతో ఒకేసారి తెరంగేట్రం చేసిన ఆలియా భట్, సిద్ధార్థ మల్హోత్రాల మధ్య  ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఇప్పటికే హిందీ పరిశ్రమ వర్గాలు కోడైకూస్తున్నాయి.అయితే, తాజా ఖబర్ ఏంటంటే, ఈ ఇద్దరి మధ్య కొంత కాలంగా మాటల్లేవట. ఎందుకంటే, ఇటీవల జరిగిన ఓ పార్టీలో ఆలియా మాజీ ప్రేమికుడు ఆమెతో క్లోజ్‌గా మూవ్ కావడం సిద్ధార్థకు నచ్చలేదనీ, ఆ కారణంతో అతనితో గొడవ కూడా పెట్టుకున్నాడట. ఆ కోపంతోనే  సిద్ధార్థతో ఆలియా మునుపటిలా మాట్లాడటం లేదనీ, ఇటీవల సిద్ధార్థ ఇచ్చిన పార్టీకి కూడా ఆమె హాజరుకాలేదని భోగట్టా. మరి ఫ్యూచర్‌లో ఏమవుతుందో ఏంటో మరి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top