
ఆమదాలవలసలో ఫ్యాన్ గాలి
జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఇక్కడ కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే
ఆమదాలవలస, న్యూస్‌లైన్: జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఇక్కడ కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఎమ్మెల్యే అభ్యర్థులుగా విజయం సాధిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ వారి మధ్యనే పోటీ నెలకొంది. అయితే, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందినవారంతా వైఎస్సార్ సీపీతో అడుగు కలుపుతుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం విజయం దిశగా పయనిస్తున్నారు. టీడీపీ తరఫున బరిలోకి దిగిన కూన రవికుమార్ కు ప్రజల్లో అంతగా గుర్తింపులేకపోవడం, సొంత మండలం పొందూరులో వీస్తున్న వ్యతిరేక పవనాలతో కలవర పడుతున్నారు. రాష్ర్టవిభజన పాపం మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన సత్యవతికి పూర్తిగా ఎదురుగాలి వీస్తోంది. ఎన్నికలు సందర్భంగా అభ్యర్థుల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే...
తమ్మినేని సీతారాం (వైఎస్సార్‌సీపీ)
కలిసొచ్చే అంశాలు...
30 ఏళ్లు రాజకీయ అనుభవం. ప్రజల్లో గుర్తింపు ఉండడం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందినవారంతా వైఎస్సార్ సీపీకి మొగ్గుచూపడం నియోజకవర్గంలో అధికమంది సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీల మద్దతు
జగన్‌మోహన్ రెడ్డి మాటతప్పని నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం రాష్ర్ట విభజనకు కాంగ్రెస్, టీడీపీలు సహకరించాయన్న భావన ప్రజల్లో ఉండడం కాళింగ సామాజిక వర్గం, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడే నాయకుడిగా గుర్తింపు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి చెందిన వ్యక్తులు, నాయకులతో సత్సంబంధాలు. పేరుపెట్టి పిలవగలిగే చనువు ఉండడం.
ప్రతికూలాంశాలు...
పార్టీలు మారుతున్నారన్న అపవాదు ఒకే కుటుంభానికి చెందిన వ్యక్తులు వైఎస్సార్ సీపీ, టీడీపీ
తరఫున బరిలో దిగడం, ఓట్లు చీలే అవకాశం.
బొడ్డేపల్లి సత్యవతి (కాంగ్రెస్)
అనుకూలం...
నియోజకవర్గంలో బొడ్డేపల్లి కుటుంబానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు ప్రజలకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అందించిన సేవలు, సంక్షేమ పథకాలు ఎవరికీ హానిచేయరనే నమ్మకం.
ప్రతికూలం...
రాష్ర్ట విభజనతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోవడం నాలుగు మండలాల్లోనూ వైఎస్సార్ సీపీలో చేరిన కాంగ్రెస్ క్యాడర్ వైఎస్సార్ మరణానంతరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టకపోడవడం పెర్సెంటీజీల కోసం పనులను ఆమె అనుచరులకే కట్టబెట్టారన్న అపవాదు సమైక్యాంధ్ర ఉద్యమకారులపై దురుసుగా ప్రవర్తించడం, ఉద్యమానికి దూరంగా ఉండడం.
కూన రవికుమార్
కలిసొచ్చే అంశాలు..
ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడి విస్తృత ప్రచారం. సీతారాంపై తప్పుడు ప్రచారాలు చేసేవారు ఎక్కువగా ఉండడం.
ప్రతికూలం...
రాజకీయ అనుభవం లేకపోవడం ఉద్యోగులు, ప్రజలతో దురుసుగా ప్రవర్తించడం, ఉద్యోగులను బ్లాక్‌మెయిల్ చేయడం ఎంపీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో రౌడీయిజం చేయడం సొంత మండలమైన పొందూరులో ఎదురుదెబ్బ తగలడం ప్రతి మండలంలోను అసంతృప్తి వాదులు, వ్యతిరేకులు ఉండడం అక్కాచెల్లెల్లు కుటుంబాలను విడదీసి తమ్మినేనికి వ్యతిరేకంగా టీడీపీలో స్థానం సంపాదించారన్న అపవాదు చంద్రబాబు పాలనపై ప్రజల్లో నమ్మకంలేకపోవడం రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తుంది.. టీడీపీకి ఓట్లు వేసినా వృథాగా పోతాయనే భావన ప్రజల్లో ఉండడం