ఆమే నిర్ణేత | Sakshi
Sakshi News home page

ఆమే నిర్ణేత

Published Sat, Mar 22 2014 1:47 AM

Women are competing with men in every field of life

పార్టీల మేనిఫెస్టోలను నిర్దేశిస్తున్న స్త్రీలు
 ఎల్.సుమన్‌రెడ్డి:  ఆకాశంలో సగమైన అతివ ఇప్పుడు అన్ని అవకాశాలనూ రెండు చేతులా అందిపుచ్చుకుంటోంది. ప్రతి రంగంలోనూ ముందంజ వేస్తోంది పురుషులకు దీటుగానే గాక వారికంటే మిన్నగా కూడా రాణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళా నేతల సారథ్యంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్న పలు దేశాలే అందుకు రుజువు. కానీ వున నేతాశ్రీలు మాత్రం మహిళలను ఓటు బ్యాంకుగా చూస్తూ వచ్చారే తప్ప విధాన నిర్ణయు ప్రక్రియులో వారికి సముచిత ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కల్పించేందుకు ఏనాడూ చిత్తశుద్ధి కనబరచలేదు. దశాబ్దాల తరబడి చట్టసభల ఆమోదం కోసం ఎదురుతెన్నులు చూస్తున్న మహిళా బిల్లే ఇందుకు సాక్ష్యం.
 
 అరుుతే పరిస్థితి వూరుతోంది. మహిళా శక్తిని ఏ పార్టీ కూడా విస్మరించలేని పరిస్థితి  ప్రస్తుతం నెలకొంది. ఒకరకంగా పార్టీలన్నీ వుహిళా జపమే చేస్తున్నారుుప్పుడు. ఎన్నికల మేనిఫెస్టోలను కూడా వుహిళలు, వారి అంశాలే నిర్దేశించే పరిస్థితి కన్పిస్తోంది. ఎందుకంటే ఎన్నికల వేళ ఊకదంపుడు విశ్లేషణలతో ఊదరగొట్టి తీరా పోలింగ్ తేదీ నాడు వుుఖం చాటేసే పురుష పుంగవులకు వుహిళల తీరు పూర్తిగా భిన్నం. దేశవ్యాప్తంగా కొంతకాలంగా ఏ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించినా వుహిళల ఓట్లే 60 శాతం, ఆ పైచిలుకు ఉంటున్నారుు. దాంతో పార్టీలన్నీ ఏదో రకంగా వుహిళా జపం చేస్తున్నారుు.
 
 ఆకట్టుకునేలా ప్రచారాస్త్రాలు
 వచ్చే లోక్‌సభ ఎన్నికలు మహిళా ట్రెండుకు నాంది పలికే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నారుు.  ఢిల్లీనే గాక దేశవుంతటినీ కుదిపేసిన నిర్భయు అత్యాచార ఘటన అనంతరం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోలైన ఓట్లలో పురుషుల కంటే వుహిళల ఓట్లే ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం. తమకు సముచిత ప్రాధాన్యం, ఆత్మగౌరవంతో పాటు భద్రత కూడా కల్పించాలన్న డిమాండ్లు నేటి మహిళ నోట విన్పిస్తున్నారుు.  పార్టీల వైఖరి కూడా అందుకు అనుగుణంగానే మారుతోంది.
 
 మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అవి సరికొత్త ప్రచారాస్త్రాలతో ముందుకు వస్తున్నా యి. వారికోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోలను రూపొం దించే పనిలో పడ్డాయి. మహిళా సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతి వేదికపైనా ప్రకటిస్తున్నారు. బీజేపీ కూడా అత్యాచారాలకు కఠిన శిక్షలు, భద్రతా దళాల్లో మహిళల సంఖ్య పెంపు వంటి దశ సూత్ర ప్రణాళిక ప్రకటించింది. సావూజిక నినాదంతో దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ వావుపక్ష వుహిళావాదుల భాగస్వావ్యుంతో ఆరు సూత్రాల ‘విమెనిఫెస్టో’ను సిద్ధం చేసింది. అయితే దేశవ్యాప్తంగా మహిళల ఓటింగ్ శాతం పెరుగుతున్నంతగా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం మాత్రం పెరగకపోవడం బాధాకరం. జనాభాలో దాదాపు సగవుున్న మహిళలకు ప్రస్తుత లోక్‌సభలో లభించిన ప్రాతినిధ్యం 10.7 శాతం మాత్రమే కావడం గమనార్హం.      

Advertisement
Advertisement