ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారథి, సినీనటుడు చిరంజీవిపైకి బుధవారం రాత్రి అనంతపురం జిల్లా గోరంట్లలో గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరారు.
గోరంట్ల, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారథి, సినీనటుడు చిరంజీవిపైకి బుధవారం రాత్రి అనంతపురం జిల్లా గోరంట్లలో గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరారు. తొలుత ఏపీసీసీ చీఫ్, పెనుకొండ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.రఘువీరారెడ్డితో కలిసి ఆయన రోడ్‌షో నిర్వహించారు.
అనంతరం బస్టాండ్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగా కొందరు కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అవి చిరంజీవికి తగలకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పూలతో కలిపి వేసిన కోడిగుడ్లు మాత్రం చిరంజీవికి తగిలాయి. దీంతో చిరు తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.