ఎన్నికల సిరా.. ప్రత్యేకత ఇలా! | voter has to be applied election ink to hand nail during of elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిరా.. ప్రత్యేకత ఇలా!

Mar 27 2014 1:00 AM | Updated on Aug 14 2018 7:49 PM

ఎన్నికల సిరా.. ప్రత్యేకత ఇలా! - Sakshi

ఎన్నికల సిరా.. ప్రత్యేకత ఇలా!

పచ్చబొట్టూ చెరిగిపోదులే.. అన్నట్లు ఎన్నికల సిరా కూడా ఓటు వేసిన ప్రతి ఒక్కరి వేలిపై రెండు మూడు రోజులపాటు చెరిగిపోకుండా ఉంటుంది.

సాక్షి, సిటీబ్యూరో: పచ్చబొట్టూ చెరిగిపోదులే.. అన్నట్లు ఎన్నికల సిరా కూడా ఓటు వేసిన ప్రతి ఒక్కరి వేలిపై రెండు మూడు రోజులపాటు చెరిగిపోకుండా ఉంటుంది. ఎన్నికల అక్రమాలు, ద్వంద్వ ఓటింగ్ నిరోధించేందుకు ప్రవేశపెట్టిందే ఈ ఎలక్షన్ ఇంక్(ఎన్నికల సిరా). ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి అభ్యర్థి ఎడమచేతి చూపుడు వేలుకు ఈ ఇంక్‌ను పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
 
 ఏమి సిరా..
 ఇండెలిబుల్ ఇంక్ దీని వ్యవహార నామం. శాస్త్రీయంగా ‘ఫాస్పోరిక్ ఇంక్’ అని పిలుస్తారు. ఇందులో సిల్వర్ నైట్రేట్ అనే రసాయనం మిళితమై ఉంటుంది. 5 మిల్లీలీటర్ల సిరా 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఇటీవల ఇండెలిబుల్ ఇంక్ మార్కర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో 1951 నుంచి ఈ ఇంక్ వాడకం అమల్లో ఉంది.
 
 ఎలా పనిచేస్తుంది..
 ఈ సిరాను ఎన్నికల కమిషన్ అన్ని పోలింగ్ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ సిరా లేనిదే ఎన్నికల తంతు ముగియదంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల సిబ్బంది ఈ సిరాను వెంట తీసుకోనిదే పోలింగ్ కేంద్రాలకు రారంటే దీని ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరా మోతాదు స్వల్పంగానే ఉంటుంది. ఒకవేళ సిల్వర్ నైట్రేట్ మోతాదు పెరిగితే చర్మానికి హాని త ప్పదు. ఇక ఇది వేలి గోరుకు పెట్టిన 15 సెకండ్లలోగా చర్మంలోకి ఇంకి పోతుంది. ఇది చెరిగిపోయేందుకు 72 నుంచి 96 గంటల సమయం పడుతుంది.
 
 ఎక్కడెక్కడ..
 ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ ఇంక్ వాడకం అమల్లో ఉంది. థాయ్‌లాండ్, సింగపూర్, నైజీరియా, మలేసియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు మన దేశంలోని ఇండెలిబుల్ ఇంకే సరఫరా అవుతుండడం విశేషం. మన దేశంలో మైసూరు, హైదరాబాద్ నగరాల్లో ఇండెలిబుల్ ఇంక్ తయారీదారులు ఉన్నారు. దొంగ ఓటు వేసే వారిని సులభంగా కట్టడి చేసే విషయంలో ఈ సిరా ఉపయోగం వెలకట్టలేనిదని ఎన్నికల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement