breaking news
voter enroll
-
ఎన్నికల సిరా.. ప్రత్యేకత ఇలా!
సాక్షి, సిటీబ్యూరో: పచ్చబొట్టూ చెరిగిపోదులే.. అన్నట్లు ఎన్నికల సిరా కూడా ఓటు వేసిన ప్రతి ఒక్కరి వేలిపై రెండు మూడు రోజులపాటు చెరిగిపోకుండా ఉంటుంది. ఎన్నికల అక్రమాలు, ద్వంద్వ ఓటింగ్ నిరోధించేందుకు ప్రవేశపెట్టిందే ఈ ఎలక్షన్ ఇంక్(ఎన్నికల సిరా). ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి అభ్యర్థి ఎడమచేతి చూపుడు వేలుకు ఈ ఇంక్‌ను పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఏమి సిరా.. ఇండెలిబుల్ ఇంక్ దీని వ్యవహార నామం. శాస్త్రీయంగా ‘ఫాస్పోరిక్ ఇంక్’ అని పిలుస్తారు. ఇందులో సిల్వర్ నైట్రేట్ అనే రసాయనం మిళితమై ఉంటుంది. 5 మిల్లీలీటర్ల సిరా 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఇటీవల ఇండెలిబుల్ ఇంక్ మార్కర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో 1951 నుంచి ఈ ఇంక్ వాడకం అమల్లో ఉంది. ఎలా పనిచేస్తుంది.. ఈ సిరాను ఎన్నికల కమిషన్ అన్ని పోలింగ్ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ సిరా లేనిదే ఎన్నికల తంతు ముగియదంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల సిబ్బంది ఈ సిరాను వెంట తీసుకోనిదే పోలింగ్ కేంద్రాలకు రారంటే దీని ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరా మోతాదు స్వల్పంగానే ఉంటుంది. ఒకవేళ సిల్వర్ నైట్రేట్ మోతాదు పెరిగితే చర్మానికి హాని త ప్పదు. ఇక ఇది వేలి గోరుకు పెట్టిన 15 సెకండ్లలోగా చర్మంలోకి ఇంకి పోతుంది. ఇది చెరిగిపోయేందుకు 72 నుంచి 96 గంటల సమయం పడుతుంది. ఎక్కడెక్కడ.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ ఇంక్ వాడకం అమల్లో ఉంది. థాయ్‌లాండ్, సింగపూర్, నైజీరియా, మలేసియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు మన దేశంలోని ఇండెలిబుల్ ఇంకే సరఫరా అవుతుండడం విశేషం. మన దేశంలో మైసూరు, హైదరాబాద్ నగరాల్లో ఇండెలిబుల్ ఇంక్ తయారీదారులు ఉన్నారు. దొంగ ఓటు వేసే వారిని సులభంగా కట్టడి చేసే విషయంలో ఈ సిరా ఉపయోగం వెలకట్టలేనిదని ఎన్నికల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఓటరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌లో రాష్ట్రం ముందంజ : భన్వర్‌లాల్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదులో మన రాష్ట్రమే ముందంజలో ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. డిసెంబర్ నుంచి ఓటర్లకు బహుళ ప్రయోజనాలతో స్మార్ట్‌కార్డులు అందిస్తామని చెప్పారు. ఇన్ఫోటెక్, లీడ్ ఇండియా సౌజన్యంతో ఏర్పాటు చేసిన మొబైల్ ఓటరు నమోదు వాహనాన్ని భన్వర్‌లాల్ సోమవారం హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... ఓటింగ్ నమోదుపై విస్తృత ప్ర చారం అవసరమని చెప్పారు. దేశం లో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 59 శాతం ఆన్లైన్ ద్వారా ఓటరు రిజిస్ట్రేషన్లు అందాయని తెలిపారు. మొబైల్ వాహనాలతో అవగాహన ఓటరు నమోదు కార్యక్రమంలో అవగాహన కల్పించేందుకు ఇన్ఫోటెక్, లీడ్ ఇండియా దేశవ్యాప్తంగా మొబైల్ సర్వీసులను ప్రారంభించింది. వివిధ సం స్థల కార్యాలయాల వద్దకే వెళ్ళి ఓటరు నమోదు కార్యక్రమం చేపడతామని ఇన్ఫోటెక్ చైర్మన్ అశోక్‌రెడ్డి తెలిపారు.