స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి | vijayamma was taking about in road show | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

Mar 26 2014 3:35 AM | Updated on May 25 2018 9:12 PM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటాలని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు.

 పెనుబల్లి, న్యూస్‌లైన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటాలని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వెళ్తున్న విజయమ్మకు మార్గమధ్యలో పెనుబల్లి గ్రామస్తులు ఎదురేగి స్వాగతం పలికారు. పెనుబల్లి జడ్పీటీసీ అభ్యర్థి మాలోతు రాధ,  ఎంపీటీసీ -1 అభ్యర్థి కోటగిరి సుధాకర్‌లను గెలిపించాలని పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం రింగ్‌సెంటర్‌లో విజయమ్మ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

 

పెనుబల్లి రాతోని చెరువుకు  మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లిప్టు మంజూరు చేయడం ద్వారా ఈ ఏడాది పంటలు పుష్కలంగా పండుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల నుంచి సాధారణ ఎన్నికల వరకు వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళిగా, జగన్‌కు బహుమతిగా అందించాలని కోరారు.  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ సత్తా చాటుతుందని, ప్రాంతాలను విడదీశారే తప్ప ప్రజల మనషులను కాదన్నారు. కార్యక్రమంలో పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షులు చెక్కిలాల మోహన్‌రావు, కీసర శ్రీనివాసరెడ్డి, మాళోతు రాధాకృష్ణ, కర్నాటి వీరభద్రారెడ్డి, శీలం వెంకటేశ్వరరెడ్డి, బీమిరెడ్డి నాగిరెడ్డి, చీపి కృష్ణారావు, బొర్రా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement