'వేమూరి వంద కోట్ల రూపాయలు వెనకేశాడు' | Sakshi
Sakshi News home page

'వేమూరి వంద కోట్ల రూపాయలు వెనకేశాడు'

Published Mon, May 5 2014 3:26 PM

'వేమూరి వంద కోట్ల రూపాయలు వెనకేశాడు' - Sakshi

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు మైండ్‌ గేమ్‌లో లగడపాటి రాజగోపాల్ ఒక పార్టు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు విమర్శించారు. ఇంతకుముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తప్పుడు సర్వేలు సృష్టించి బెట్టింగ్‌లను ప్రోత్సహించాడని తద్వారా దాదాపు రూ.100 కోట్లు సంపాదించాడు ఆయన ఆరోపించారు.

తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా చేసి రాష్ట్రాన్ని యాభై ఏళ్లు వెనక్కి నెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాడని అంతుకుముందు విమర్శించారు. ఒకప్పుడు తిట్టిన నోటితోనే ఇప్పుడు మోడీని కీర్తిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే సీమాంధ్ర ప్రజలు ఉన్నారని ఆదిశేషగిరిరావు అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement