మా బావకే మీ ఓటు! | Thottempudi Venu campaign for Nama Nageswara Rao | Sakshi
Sakshi News home page

మా బావకే మీ ఓటు!

Apr 21 2014 10:19 AM | Updated on Aug 29 2018 1:59 PM

మా బావకే మీ ఓటు! - Sakshi

మా బావకే మీ ఓటు!

సిల్వర్ స్క్రీన్ స్టార్స్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. వెండితెరపై వినోదం పంచే నటులు తమ వారి కోసం ప్రజల వద్దకు తరలివస్తున్నారు.

సిల్వర్ స్క్రీన్ స్టార్స్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. వెండితెరపై వినోదం పంచే నటులు తమ వారి కోసం ప్రజల వద్దకు తరలివస్తున్నారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం చేస్తున్నారు. తమ గ్లామర్ తో ఆత్మీయులకు ఓట్లు సంపాదించేందుకు చెమటోడ్చుతున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు తారలు ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. మన రాష్ట్రంలోనూ వెండి తెర నటులు తమ వారి కోసం కష్ట పడుతున్నారు.

ఖమ్మం లోకసభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు తరపున ఆయన బావమరిది, సినీ నటుడు వేణు ప్రచారం చేస్తున్నారు. తన బావకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. స్వయంవరం, చిరునవ్వుతో తదితర సినిమాల్లో నటించిన వేణు వైవిధ్యమైన నటుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన బావ గెలుపు కోసం శ్రమిస్తున్నారు.

ప్రిన్స్ మహేష్ బాబు కూడా తన బావ గల్లా జయదేవ్ కు ఓటు వేయాలని ట్విటర్ ద్వారా అభ్యర్థించారు.  గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జయదేవ్ పోటీ చేస్తున్నారు.  జయదేవ్ తరపున మహేష్ బాబు ప్రచారం చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. తన బావ, వియ్యంకుడు చంద్రబాబు నాయుడు కోసం నందమూరి బాలకృష్ణ కూడా ప్రచార పర్వంలో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేశారు. అయితే ఈసారి స్వయంగా అసెంబ్లీకి పోటీ చేస్తూ పనిలో పనిగా పార్టీకి ఎన్నికల ప్రచారం కూడా చేసేస్తున్నారు. తమ బావల కోసం బావమరుదులు బాగానే కష్టపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement