ఇక అసలు పోరు | the general election adoption of nominations from today | Sakshi
Sakshi News home page

ఇక అసలు పోరు

Apr 2 2014 3:03 AM | Updated on Aug 29 2018 8:54 PM

సార్వత్రిక ఎన్నికల ఘట్టం ప్రారంభం కానుంది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. జడ్‌పీటీసీ, ఎంపీటీసీలకు ఈ నెల 6, 11 తేదీలలో రెండు విడతలలో పోలింగ్ జరగనుంది.

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఘట్టం ప్రారంభం కానుంది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. జడ్‌పీటీసీ, ఎంపీటీసీలకు ఈ నెల 6, 11 తేదీలలో రెండు విడతలలో పోలింగ్ జ రగనుంది. ఈ క్రమంలోనే జిల్లాలో రెం డు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజ కవర్గాలకు ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. రాష్ట్రంలో రెండు విడతలలో ఎన్నికలు జరగనుండగా, ఈసారి కూడా మొదటి విడతలోనే జిల్లాలో ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల స్వీకరణ 9న ముగియనుం డగా, 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 11, 12 తేదీలలో నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అ నంతరం అభ్యర్థులు ప్రచార ఘట్టాన్ని ప్రారంభిస్తా రు. పోలింగ్ అనంతరం వచ్చే నెల 16న ఓట్ల లెక్కిం పు, ఫలితాలు ఉంటాయి.

 అభ్యర్థులను ప్రకటించని పార్టీలు
 సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు సర్వసన్నద్ధమైనా.. అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. సీపీఎం మాత్రం నిజామాబాద్ అర్బన్‌కు సబ్బని లత, బాన్సువాడకు నూర్జహాన్ పేర్లతో ఎమ్మె ల్యే అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కాంగ్రెస్, టీ ఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్‌ఆర్ సీసీ, టీడీపీ, సీపీఐ తది తర పార్టీలు అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. ఆశావహులు మాత్రం నామినేషన్ వేసేం దుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లోక్‌సభ అభ్యర్థు లు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో, ఎమ్మె ల్యే అభ్యర్థులు నియోజకవర్గం కేంద్రంలోని తహశీల్దారు/ఆర్‌డీఓ కార్యాలయాలలో నామినేషన్లు దా ఖలు చేయాల్సి ఉంటుంది. లోక్‌సభకు పోటీ చేసే జ నరల్/బీసీ అభ్యర్థులు రూ.25 వేలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులైతే రూ.12,500 ధరావత్తు చెల్లించాలి. ఎమ్మెల్యే అభ్యర్థులు జనరల్, బీసీలైతే రూ.10 వేలు, ఎస్‌సీ,ఎస్‌టీ లు రూ.5 వేలు ధరావత్తు చెల్లించాలి. లోక్‌సభ అభ్యర్థుల ఖర్చు రూ.70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చు రూ. 28 లక్షలు మించరాదని ఎన్నికల కమిషన్ నిర్దేశించింది.

 అధికార యంత్రాంగం రెడీ
 సార్వత్రిక ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారయంత్రాంగం సర్వసన్నద్ధమైంది. సుమారు 18 లక్షల పై చిలుకు ఓ టర్ల కోసం 2,005 పోలింగ్ కేంద్రాలు, 4,010 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) సిద్ధం చేశారు. వారంలో రెండు మూడు రోజులు ఎన్నికల నిర్వహణ పై ముఖ్య ఎన్ని కల అధికారి భన్వర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారుల కు ఈవీఎంలపై శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే అదనపు పోలీసు బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. సున్నిత, అతిసున్నిత పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు వీడియో కెమెరాల నిఘా ఏర్పాటుకు సిద్ధమయ్యారు.

 ఓటర్ల వివరాలు
 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 18,06,165 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో పురుషుల కంటే మహిళల సంఖ్యనే అధికంగా ఉంది. 9,32,011 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రెండు రోజుల కిందటే పోలింగ్ కేంద్రాలను జిల్లా ఉన్నతాధికారులు ఫైనల్‌గా పరిశీలించారు. వీడియో రికార్డింగ్, వెబ్‌కాస్టింగ్, లైవ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement