తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్‌లో త్రీడీషో ద్వారా ఆయన ప్రసంగించారు.
అనంతగిరి, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్‌లో త్రీడీషో ద్వారా ఆయన ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడిన ఆయన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఎలా మోసపోయారనే విషయాన్ని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలనుకుంటే, మంచి పరిపాలన కావాలంటే ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు అధికారం ఇవ్వాలన్నారు. రాజకీయ అవినీతిని పాతాళంలోకి తొక్కాలన్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్ష నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజీవరావు మాట్లాడుతూ.. నేడు ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి పైలట్ రోహిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శుభప్రద్ పటేల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణయ్య, విజయ్‌కుమార్, ఎల్లారెడ్డి, రాంచందర్ రెడ్డి, మున్వర్ షరీఫ్, ముత్తాహర్ షరీఫ్, శంకర్‌చ మహేందర్‌రెడ్డి, రాంరెడ్డి, కిశోర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.