సీమాంధ్రలో ఎన్నికల పోలింగ్ ముగిసినా టీడీపీ ఆగడాలు ఆగడం లేదు. తమకు ఓటు వేయని వారిపై దాడులకు దిగుతున్నారు.
చిత్తూరు: సీమాంధ్రలో ఎన్నికల పోలింగ్ ముగిసినా టీడీపీ ఆగడాలు ఆగడం లేదు. తమకు ఓటు వేయని వారిపై దాడులకు దిగుతున్నారు. చిత్తూరు జిల్లాలో మూడు గ్రామాల్లో దళితులపై టీడీపీ కార్యకర్తల దాడులకు పాల్పడ్డారు. గంగాధర నెల్లూరు మండలం పాచిగుంటలో మహిళలతో సహా పలువురిపై దాడులు చేశారు. టీడీపీ కార్యకర్తల దాడితో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. 20 మంది మహిళలు గాయపడ్డారు.
అంబోదారిపల్లెలోనూ టీడీపీ కార్యకర్తలు తెగబడ్డారు. ఈ ఘటనలో సురేంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆముదాలలో తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులను భయభ్రాంతులకు గురి చేశారు.