టీడీపీ అభ్యర్థి కుమార్తె అదృశ్యం | tdp Candidate daughter missing | Sakshi
Sakshi News home page

టీడీపీ అభ్యర్థి కుమార్తె అదృశ్యం

Apr 25 2014 2:03 AM | Updated on Aug 10 2018 8:06 PM

నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె హారిక(12) గురువారం హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది.

మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
 
 సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె హారిక(12) గురువారం హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. మీర్‌పేట ఎస్‌ఐ ఎలక్షన్‌రెడ్డి కథనం ప్రకారం.. బిల్యానాయక్‌కు నగరంలోని బీఎన్‌రెడ్డినగర్, సిరిపురం కాలనీలలో రెండు నివాసాలున్నాయి. నాయక్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నిమిత్తం తన భార్యతో కలిసి దేవరకొండ వెళ్లారు. 8వ తరగతి చదువుతున్న కుమార్తె హారికను వార్షిక పరీక్షల కోసం బీఎన్‌రెడ్డి నగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంచారు. పరీక్షలు పూర్తవడంతో కుమార్తెను తీసుకుపోయేందుకు తల్లి అనిత బుధవారం రాత్రి సిరిపురం కాలనీలో ఉన్న తన ఇంటికొచ్చారు. ఆ రాత్రికి అక్కడే ఉండి గురువారం ఉదయం ఆమె బీఎన్‌రెడ్డి నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ తమ కుమార్తె జాడలేకపోవడంతో వెంటనే భర్తకు విషయాన్ని తెలియజేశారు. బిల్యానాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement