ఎడతెగని.. స్క్రూటినీ | Scrutiny of candidates to be enthusiastic about the territorial authorities | Sakshi
Sakshi News home page

ఎడతెగని.. స్క్రూటినీ

Mar 22 2014 12:19 AM | Updated on Aug 29 2018 4:16 PM

ప్రాదేశిక అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన అధికారులకు ఓ ప్రహసనంలా మారింది.


 నల్లగొండ, న్యూస్‌లైన్, ప్రాదేశిక అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన అధికారులకు ఓ ప్రహసనంలా మారింది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగింది. మండలాల్లో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన వేగంగానే పూర్త్తయినప్పటికీ, జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగింది.
 
 ఒక్కో పార్టీ నుంచి పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో అధికారులు నామినేషన్ల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి వచ్చింది. రాత్రి పొద్దుపోయే వరకు ‘న్యూస్‌లైన్’కు అందిన సమాచారం మేరకు జెడ్పీటీసీ 59 స్థానాలకు 14 మండలాల నామినేషన్లు మాత్రమే పూర్తయ్యాయి.
 
 మొత్తం 59 స్థానాలకు గాను 1250మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 1245 మంది అర్హత సాధించారు. 5 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.45 మండలాల నామినేషన్ల పరిశీలన పూర్తయితే తిరస్కరణకు గురియ్యే నామినేషన్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంపీటీసీ 835 స్థానాలకు గాను 8.766 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిల్లో 53 మండలాల్లో 8,463 అర్హత సాధించాయి. 303తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికల నిబంధనలకు లోబడి నామినేషన్లు లేకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరించారు.
 
 అభ్యర్థుల పడిగాపులు..
 జెడ్పీ ప్రాంగణంలో అభ్యర్థులు అర్ధరాత్రి వరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇంగ్లీషు అక్షరమాల ప్రకారం డివిజన్‌ల వారీగా జెడ్పీటీసీ అభ్యర్థులను సమావేశ మందిరంలోకి ఆహ్వానించి నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మోహన్‌రావు సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు సాయంత్రం జెడ్పీకి వచ్చి పరిశీలన కార్యక్రమాన్ని సమీక్షించారు.
 
 నేడు అప్పీళ్లు..
 నోటీసులు అందుకున్న అభ్యర్థులు శుక్రవారం అప్పీలు చేయనున్నారు. ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీఓల వద్ద, జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌కు అప్పీలు చేసుకుంటారు. అధికారులు అందజేసిన నోటీసులు, అభ్యర్థుల అప్పీళ్లను పరిశీలించిన పిద ప తుది నిర్ణయాన్ని ఆదివారం ప్రకటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement