గంగమ్మా.. జగనన్న సీఎం కావాలమ్మా | peoples are looking for ys jagan ruling | Sakshi
Sakshi News home page

గంగమ్మా.. జగనన్న సీఎం కావాలమ్మా

May 14 2014 2:42 AM | Updated on Aug 29 2018 8:56 PM

గంగమ్మా.. జగనన్న సీఎం కావాలమ్మా - Sakshi

గంగమ్మా.. జగనన్న సీఎం కావాలమ్మా

శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా ఆశీర్వదించు గంగమ్మతల్లీ అని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వేడుకున్నారు.

 తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా ఆశీర్వదించు గంగమ్మతల్లీ అని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వేడుకున్నారు. మంగళవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా పార్టీ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మగుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రజాసంక్షేమాన్ని కోరుకునే జగనన్నను ముఖ్యమంత్రిని చేయి గంగమ్మతల్లీ అంటూ వేడుకున్నారు.

అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కుట్రలు కుతంత్రాలతో రాష్ట్రాన్ని ముక్కలు చేసి, ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు తిరిగి ప్రతిపక్షంలోనే ఉండేలా చూడాల ని గంగమ్మ తల్లికి మొక్కుకున్నామన్నారు. నిత్యం ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్న జగనన్న పాలనలో ఐతేనే ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, టి.రాజేంద్ర, ఆదికేశవులురెడ్డి, కొండారెడ్డి, రవిచంద్ర, గఫూర్, పవన్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement