'డిపాజిట్లు రావని పార్టీ పెట్టినప్పుడే చెప్పా' | peddireddy Ramachandra Reddy slams Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

'డిపాజిట్లు రావని పార్టీ పెట్టినప్పుడే చెప్పా'

Apr 20 2014 1:40 PM | Updated on Aug 14 2018 4:21 PM

'డిపాజిట్లు రావని పార్టీ పెట్టినప్పుడే చెప్పా' - Sakshi

'డిపాజిట్లు రావని పార్టీ పెట్టినప్పుడే చెప్పా'

ఓటమి భయంతో ఎన్నికల నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి తప్పుకున్నారని వైఎస్ఆర్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.

తిరుపతి: ఓటమి భయంతో ఎన్నికల నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి తప్పుకున్నారని వైఎస్ఆర్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. డిపాజిట్లు రావని ఆయన పార్టీ పెట్టినప్పుడే చెప్పానని గుర్తు చేశారు. సోనియా గాంధీకి తప్పుడు సమాచారమిచ్చి కిరణ్ సీఎం అయ్యారని ఆరోపించారు.

జగన్ లేని లోటును తాను తీరుస్తానంటూ ఢిల్లీ పెద్దలకు కిరణ్‌ మాయమాటలు చెప్పారని వెల్లడించారు. ఆ తర్వాత చంద్రబాబుతో కలిసి మూడేళ్లు సీఎంగా కొనసాగారని అన్నారు. ఈ ఎన్నికల్లో కూడా పీలేరులో కిరణ్‌, చంద్రబాబులు కలిసి నాటకాలాడుతున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. పీలేరు పోటీ నుంచి కిరణ్ తప్పుకున్నారు. తన సోదరుడిని పోటీకి నిలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement