కడప లోక్‌సభ స్థానానికి మంగళవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి తరపున ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి శశిధర్‌కు అందజేశారు.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కడప లోక్‌సభ స్థానానికి మంగళవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి తరపున ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి శశిధర్‌కు అందజేశారు. పిరమిడ్ పార్టీ అభ్యర్థి గజ్జల రామసుబ్బారెడ్డి ఒక సెట్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి వెంకల భాగ్యలక్ష్మి ఒక సెట్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థి జక్కం వెంకటరమణ నామినేషన్ దాఖలు చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నగిరిపల్లె యానాదయ్య నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి కొనుదుల నారాయణరెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా సి.సుజనాదేవి ఒక సెట్‌నామినేషన్‌ను సమర్పించారు.