
వైఎస్సార్‌సీపీలోకి వలసల జోరు
వైఎస్సార్‌సీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నా రు.
జిల్లా వ్యాప్తంగా వేలాది మంది పార్టీలో చేరిక
ఖాళీ అవుతున్న కాంగ్రెస్
టీడీపీకీ తప్పని షాక్
సాక్షి ప్రతినిధి, విజయనగరం :
వైఎస్సార్‌సీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నా రు. రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ నుంచైతే అధిక సంఖ్యలో బయటకు వస్తున్నారు.
ప్రజాదరణ లేని నాయకులంతా టీడీపీలో చేరుతుండగా, ప్రజాభిమానం ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలంతా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ఒకవైపు జోరుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరుగుతున్నా మరోవైపు వైఎస్సార్‌సీపీ పట్ల ఆకర్షితులై వేలాదిమంది పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
వలసల జోరుతో ఫ్యాన్‌గాలి బలంగా వీస్తోంది. కాంగ్రెస్ ఆధిపత్యం గల గ్రామాల న్నీ ఖాళీ అయిపోతున్నాయి. కార్యకర్తలతో సహా నాయకులంతా వైఎస్సార్‌సీపీలో చేరి పోతున్నారు. నెల్లిమర్ల, భోగాపురం, మెంటాడ, పాచిపెంట, పార్వతీపురం, బలి జపేట, సీతానగరం, పూసపాటిరేగ తదితర మండలాల్లో కాంగ్రెస్ దాదాపు ఖాళీ అయింది.
తాజాగా పూసపాటిరేగ మండలంలో 27 పంచాయతీల కేడర్ అంతా వైఎస్సార్‌సీపీలోకి వచ్చేసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త బేబినాయన, మాజీ ఎంపీ కొమ్మూరి సంజీవరావు, సమక్షంలో వేలాది మంది కార్యకర్త లు చేరారు.
చీపురుపల్లి, బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాల్లో ఒకటి రెండు పంచాయతీల మినహా కాంగ్రెస్ ఖాళీ అయింది. ఇప్పుడా పార్టీలో కార్యకర్తలే కాదు నాయకులకు కూడా ఉండడం లేదు. ఒకచోట చేరికలు జరుగుతుంటే తమ వద్దకు ఎప్పుడొచ్చి చేర్చుకుంటారని అడుగుతున్న పరిస్థితి చాలా గ్రామాల్లో కన్పిస్తోందని వైఎస్‌ఆర్ సీపీ నేతలు చెబుతున్నారు.
గజపతినగరం, ఎస్.కోట, చీపురుప ల్లి, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఇన్నాళ్లూ వేధించిన కాంగ్రెసోళ్లను తీసుకొచ్చి తమ నెత్తిపైకి ఎక్కిస్తున్నారన్న ఆవేదనతో చాలామంది టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
కొన్నిచోట్లైతే కాంగ్రెస్ తుక్కుతో తాము పనిచేయలేమంటూ వలసబాట పడుతున్నారు. మొత్తానికి వైఎస్సార్‌సీపీలోకి వరుసగా జరుగుతున్న చేరికలతో కాంగ్రెస్ ఖాళీ అవుతుండగా, టీడీపీకి ఊహించని షాక్ తగులుతోంది. టీడీపీలో జరుగుతున్న పరిణామాలను గమనించిన ఆ పార్టీ నాయకులు అప్రమత్త మై అసంతృప్తి వాదులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వాదు లు బయటికొచ్చి వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశం ఉంది.