కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం | justice for all categories with congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం

Apr 22 2014 2:51 AM | Updated on Mar 18 2019 9:02 PM

చింతపల్లిలో మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి - Sakshi

చింతపల్లిలో మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి

కాంగ్రెస్‌తోనే బడుగు,బలహీన అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

 కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి గుత్తా
 
 చింతపల్లి, న్యూస్‌లైన్ : కాంగ్రెస్‌తోనే బడుగు,బలహీన అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సీపీఐ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాయక్‌తో కలిసి మండలంలోని చింతపల్లి, వర్కాల, వింజమూరు, రాయినిగూడెం, బట్టుగూడెం, కిష్టరాయినిపల్లి, నసర్లపల్లి, తీదేడు గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు.
 
 ఈ సంద ర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ సాధ్యమన్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బలహీన  వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కాంగ్రెస్సేదన్నారు. శ్రీశైలం సొరంగమార్గం త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
 
  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నేనావత్ బాలునాయక్, ఉజ్జిని యాదగిరిరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, గుత్తా జితేందర్‌రెడ్డి, నాయకులు ముచ్చర్ల యాదగిరి, దొంతం సంజీవరెడ్డి, హరినాయక్, నాగభూషణ్, మాస భాస్కర్, వి.యుగేందర్‌రావు, బి.భూపాల్, విద్యాసాగర్‌రావు, మైసయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసు, జంగయ్య, వెంకటయ్య, మైసయ్య, వీరయ్య, సలీం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement