టీడీపీ చంద్రబాబుది కాదు | He also joined the party as I am: competition | Sakshi
Sakshi News home page

టీడీపీ చంద్రబాబుది కాదు

Mar 26 2014 8:52 AM | Updated on Jul 28 2018 3:21 PM

టీడీపీ చంద్రబాబుది కాదు - Sakshi

టీడీపీ చంద్రబాబుది కాదు

‘తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌దే. ఆ పార్టీని స్థాపించింది చంద్రబాబు కాదు, నాలాగే పార్టీలో చేరిన వాళ్లల్లో ఆయన కూడా ఒకరు’ అని మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు.

‘తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌దే. ఆ పార్టీని స్థాపించింది చంద్రబాబు కాదు, నాలాగే పార్టీలో చేరిన వాళ్లల్లో ఆయన కూడా ఒకరు’ అని మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా జోగిపేట నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. తాను టీడీపీకి రాజీనామా చేశానని, బాధ్యత గల వ్యక్తిగా పార్టీకి మూడు రోజుల సమయం ఇచ్చానని, కాని చంద్రబాబు నుంచి స్పందన లేదన్నారు.

అవసరమనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని.. కోపంగా ఊగిపోతూ అన్నారు. పార్టీ కండువా వేసుకోకుండా, గుర్తు చెప్పకుండా అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ‘పార్టీని నేను కాదన్నా.. అభ్యర్థులు నన్ను కాదనడం లేదు’ అని ఆయన అన్నారు.  నాకున్న చరిష్మాతో అభ్యర్థులను గెలిపించుకుంటానన్నారు. రాజీనామా చేసినట్లు ప్రకటించాక మీరు ప్రచారం చేయటంపై ప్రజల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని విలేకర్లు ప్రశ్నించగా అసహనాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement